పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

ధర్మరాజునకు బ్రాణోపద్రవము సంభవింపబోయెను. అయితే శ్రీస్వామివారి యనుగ్రహమువలన నట్లు కాక తప్పిపోయెను.

2. జ్యేష్ఠభ్రాతను దూలనాడుట యతనిని వధించుటతో సమమని శ్రీస్వామివారు సెల వచ్చిరి. పూజ్యులగువారిని నిందించు నలవాటు అందలిదోషమును దెలియక జనులకు వాడుక గాగలదు. సాధారణముగ నితరులనుగూడ నిందించుట తప్పు, అది మర్యాద కాదు.

3. ఆత్మస్తవ మాత్మహత్యవంటిదే యని శ్రీస్వామివారు సెల విచ్చిరి. ఆత్మ స్తుతి యనఁగా దనవిషయము తెలియనివారియెదుట దాను నేర్చినవిద్యను జెప్పుకొనుట కాదు. ఒకఁడు తాను చేసినదానిని నీతిబోధకముగాఁ జెప్పుకొనుటయు గాదు. అట్లు గాక విద్యయందుగాని బుద్ధియందు గాని దేహబలమునందుగాని శౌర్యమునందుగాని, ధనము, దానము, తపస్సు, కీర్తి, నేర్పు మొదలగు వానియందుగాని తనకంటె నధికులు లేరని గొప్పకొరకు జెప్పుకొనుట యాత్మస్తుతి.

శ్రీస్వామివారిచే జేయఁబడిన సంజ్ఞవలన భీముఁడు దుర్యోధనునితొడలు విరుగఁగొట్టె నని చెప్పఁబడి యున్నది. దుర్యోధనునితొడలు విరుగఁగొట్టుదు నని కౌరవసభలోఁ బ్రతిజ్ఞ చేసియుండిన భీమున కొకరు సంజ్ఞ చేయవలెనా ? దుశ్శాసనునిఁ జంపినరోజున సహా రెండవప్రతిజ్ఞయగు దీని నెరవేర్ప