పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

77

వీరులందరును ప్రవేశించునట్లు చెప్పఁబడి యున్నది. రెండుమారులు రెండువిధములుగ వర్ణింపఁబడినందున నిది విశ్వరూపము కాదని స్పష్టపడును. లేదా స్వరూపవిమర్శముతో మనకు బని యేమి ? ఏకారణమున విశ్వరూప మను రూపమును గనఁబరచిరో విచారింతము. కౌరవసభయందు విశ్వరూపమును గనఁబరచుటవలన గౌరవులు యుద్ధమును మానలేదు. తాత్కాలికదివ్యదృష్టిచే దర్శించినట్లు చెప్పఁబడినధృతరాష్ట్రుడుకూడ దనకుమారునకు యుద్ధమును మానుమని హితము చెప్పలేదు. అర్జునునకు విశ్వరూపమును జూపుటచే మాత్రము విముఖుఁ డయిన యర్జునుఁడు యుద్ధమున కభిముఖుఁ డయ్యెను. కావున నర్జునునకు శ్రీస్వామివారు తమ స్వరూపమును జూపి యుందురు. కాని యద్వైతియగు భారత గ్రంథకర్త వర్ణించిన రూపము కానే కాదు. యద్వైతి పంచదేవతారాధనపరుఁడు గావున శక్తికిని స్వామికిని నభేదముగా భావించి యాముఖములో జాపబోవువారు చొచ్చుచున్నట్లు వర్ణించెను. పరమభక్తుఁడును సఖుఁడును నగు సర్జునునకు గనఁబరచినరూప మితరులకు దెలిసికొన నలవి యగునా? కావున నర్జునునకు శ్రీస్వామివారు స్వస్వరూపమును జూపియుండిన నుండవచ్చును. ఈయంశము వినియున్న కౌరవపక్షపాతి యగు నీగ్రంథకర్త యీయర్జునునకే