పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

శత్రువులు నీశక్తిని నిందించుచు ననేకములైన యాడరానిమాటల నాడుదురు. అంతకంటె నధికమైనదుఃఖమును గలిగించునది మరి యేది గలదు?

ఓ కుంతీపుత్రుఁడవైనయర్జునా ! నీవు యుద్ధమునందు జంపఁబడినయెడల స్వర్గమును బొందుదువు. శత్రువులను జయించితివేని రాజ్యము సనుభవింతువు. కావున యుద్ధము చేయ నిశ్చయము గలవాఁడవు కమ్ము.

సుఖదుఃఖములను లాభాలాభములను జయాపజయములను సమానములనుగాఁ దలంచి పిమ్మట యుధ్ధముకొరకు దల పడుము. ఇట్లు గీతోపదేశము జేసినపిదప నర్జునునకు విశ్వరూపమును జూపించినట్లు చెప్పఁబడి యున్నది. దీనితో శ్రీస్వామివారు కనబరచినవి రెండు విశ్వరూపములై యున్నవి. ఇందుకు వ్రాయఁబడు నీక్రిందివిషయమును జదువరులు ముఖ్యముగా గమనింపవలెను,

విశ్వరూపము లేదా విరాడ్రూపము శ్రీస్వామివారు కనబరచియుండినయెడల నది యేకవిధముగనే యుండవలెను. 1 కౌరవసభలో గనఁబరుపఁబడినదనిన విశ్వరూపములో నాస్వామిని బాండవాదులు పరివేష్టించియున్నట్లు చెప్పఁబడి యున్నది. 2. అర్జునునకు గనఁబరచిన విశ్వరూపములో శ్రీస్వామియొక్క విస్తృతాకారముఖములోనికి జావబోవు కౌరవ