పుట:SamskrutaNayamulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

సంస్కృతన్యాయములు

ఉలూఖలమర్దలన్యాయము
  • ఱోలు వెళ్లి మద్దెలతో నన్ను అందఱును కొట్టెదరని మొఱ్ఱపెట్టుకొనగా ని న్నొకవైపుననే కొట్టెదరు; నన్ను రెండువైపులను కొట్టెదరని మద్దెల చెప్పినదట.
ఉలూఖలశేషన్యాయము
  • మొగమోటముగల యల్లుడు అత్తగారు పెట్టిన చలిమిడి తినక ఱోటిలో తల దూర్చి అందు మిగిలినది నాకినట్లు.
ఉష్ట్రకంటకభక్షణన్యాయము
  • లొట్టిపిట్ట ముండ్లకొమ్మలను నోటికి గ్రుచ్చుకొనకుండ భక్షించును.
ఉష్ట్రలగుడన్యాయము
  • ఒంటె తనచే మోయబడు కఱ్ఱలచేతనే తాను దెబ్బలు తినును. మూర్ఖత నీన్యాయము సూచించును.
ఉష్ట్రశూలన్యాయము
  • ఒంటెకు గలశూల రోకళ్ళతోగాని చక్కబడదు.
  • "చక్కగాదు లొటిపిటశూల రోకండ్లగాని" నిరం . 2.133
ఊషరబీజన్యాయము
  • చవిటినేలలో విత్తనములు చల్లినట్లు.
ఊషరవృష్టిన్యాయము
  • చవిటినేలను వర్షము గురిసినట్లు.