ఈ పుట ఆమోదించబడ్డది
9
సంస్కృతన్యాయములు
- ఇక్షువికారన్యాయము
- చెఱకుగడను గానుగలో నొక్కుటవలన రసము, ఆరసమును సరియగు పాకమున వండుటవలన బెల్లము, ఆ బెల్లము ద్వారా తదితర ఉత్తమోత్తమ మధురపదార్థములు తయారగును. అట్లే ఉత్తరోత్తర ముత్తమోత్తమ లాభప్రాప్తి నీన్యాయము సూచించును.
- ఇక్షురసన్యాయము
- మఱలలో పెట్టి గట్టిగ నొక్కినగాని చెఱకుగడనుండి రసము వెలికిరాదు.
- (రోకళ్ళతో శక్తికొలది దంపినగాని బియ్యమురావుగదా!)
- ఇషువేగక్షయన్యాయము
- ధనుస్సునుండి విడువబడిన బాణముయొక్క వేగము లక్ష్యమువఱకు పోయిగాని క్షీణింపదు.
- "ఇచ్ఛేష్యమాణసమభివ్యాహారే" అనే న్యాయము
- ఏదేని యొకయిచ్ఛ జనించుటకు ఆయిచ్ఛను కలిగించు వస్తువే కారణ మగును.
- హేతుహేతుమద్భావప్రసక్తి నీన్యాయము సూచించును.
- ఉత్ఖాతదంష్టభుజగన్యాయము
- కోఱలుతీసినపాము పైకి భయంకరముగ గాన్పించుటయే కాని కఱువజాలదు.