పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 సాహిత్య మీమాంస

అర్జునునకు ప్రతియోగి కర్ణుడు; ధృష్టద్యుమ్నుని ప్రతియోగి ద్రోణుడు; కర్ణుని ఆసురవీరత్వమునకు ప్రతియోగి ఘటోత్కచుడు; భీష్మునకు పాండవులందరూ ప్రతియోగులైనలాగున నభిమన్యునికి కురువీరు లందరును ప్రతియోగులు - యుధిష్ఠిరునకు ప్రతియోగి యెవరు? భీమార్జునులవలె దేహబలమున గాని సమరచాతురని గాని అతడు ప్రధానవీరుడు కాడు. సమరమున రాధేయున కోడి కాందిశీకుడు కాలేదా! అతని యందు ప్రధానవీరత్వము ధర్మవీరత్వము; ఈవిషయమున భీమార్జును లాతని యెదుట తలవంచుకొనవలయును. కురుపక్షమున ధర్మవీరత్వము భీష్మునియందును విదురునియందును కలదు. పాపపక్షమున నుంటచే వారివీరత్వము ప్రస్ఫుటితమగుటకు పూర్ణావకాశము చిక్కింది. పాండవపక్షమున ధర్మతేజోతిశయము మెండుకొన్నది; ప్రశాంత ధర్మాదర్శమన్ననిదే.

ఇంకొక విలక్షణమగు ఆదర్శము శ్రీకృష్ణుడు. అతని చరితమును విమర్శిస్తే తేలే సారాంశ మిది - పాపపక్షము నందలి బలము కౌశలమూ ఎంతఉన్నా దైవబలకౌశలములకు చాలదు. దైవబలమే సర్వోన్నతమగు బలము, తత్పక్షమే ఉత్కృష్టబలిష్ఠము, మానవపరాక్రమముకన్న దైవపారాక్రమమే దృఢము; అందుచే దైవబలమే సర్వదా విజయ మొందును, ధర్మము దైవబలము నాశ్రయించి యుండును. పార్థివబలమునాధారముచేసుకొన్న కురుపక్షము ధర్మబలమునూ