పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215 దేవత్వము

తర్పణములు, శ్రాద్ధములు మొదలగు కర్మలమూలాన వారు మృతజీవు లగుదురు. గురుజనమందు లగ్నమైనప్రేమ భగవదర్పితమై తద్వారా సర్వభూతములందున్నూ వ్యాపించును. భగవంతుడు సర్వాంతర్యామియైనట్లు జ్ఞానదృష్టికి ప్రత్యక్షు డగునప్పుడు భక్తు డిట్టు స్తుతించును : _

                 పశ్యామి దేవాం స్తవ దేవ దేహే సర్వాం స్తథా భూతవిశేష సంఘాన్
                 బ్రహ్మాణ మీశం కమలాసనస్థ మృషీంశ్చ సర్వా సురగాంశ్చ దివ్యాన్||
                 అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో నంత రూపమ్
                 నాంతం నమధ్యం నపున స్తనాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప|
                                                                           భగవద్గీత.
                 కనియెద దేన నీదు ఘనకాయమునందు సమస్త దేవతా
                 లిని, మరి పల్దెరంగుల వెలింగెడునట్టి అశేషభూతకో
                 టిని, సభ పద్మపీఠమున ఠీవిని దీర్చినయట్టి బ్రహ్మదే
                 వుని, తగ దివ్యమౌ నురగపుంజము, సర్వమునిప్రపంచమున్.

                 పెక్కుచేతులు పెక్కు కడ్పులు పెక్కు మోములు నేత్రముల్
                 పెక్కు దాలిచి కానిపించెదు పెక్కురూపుల నెల్లెడన్
                 నిక్కమిప్పుడు విశ్వరూపుడ నీకు నంతము మధ్యమౌ
                 యిక్క యాదియు గానిపింపన యెందు నో జగదీశ్వరా -
                                              ..................తా||ల||న||

సమాప్తము.