పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198 సాహిత్య మీమాంస

అతిథిసంతర్పణమువల్ల నాతడు పుణ్యాత్ము డగును. ధర్మజునకు దానమాహాత్మ్యము విను కౌతూహలము హెచ్చు; దాతకాని వాని కిదియుండదు. ఆర్తరక్షణముకూడా దానమని చెప్పవచ్చును. ప్రాచీనార్యుల గృహములు దానలీలాభూములు, అతిథిసేవాలయములు. ఆర్తత్రాణపరాయణులగు వీరులు మనలో చాలామంది కలరనుటకు మనవాఙ్మయమే సాక్షి.

8. క్షమ

గృహస్థునిప్రేమ గృహధర్మముల ద్వారా పెంపొంది విశ్వవ్యాపిని యగునని తెల్పియుంటిమి. ఇట్టి భావన యిప్పటికీ పూర్తిగా నశించక మన సంఘమున నచ్చటచ్చటకద్దు. పురాతన సంప్రదాయము లింకా సమసిపోలేదు, మూలనియమాలు మూలబడక ఆచరణలో నున్నవి. ప్రాచీనకుటుంబవ్యవస్థలగు బంధువులు, దాసదాసీజనము, అతిథ్యభ్యాగతు లింకా పాడువడలేదు. హిందువుల కివన్నీ ప్రేమభాజనములే అప్పటివలె కాకపోయినా గాహన్‌స్థ్యధర్మములు ఇప్పటికీ అచ్చటచ్చట నిర్వహింపబడుతూ ఉన్నవి. అందు శ్రద్ధ, భక్తి, ప్రీతి, మమతయున్నూ ఇప్పుడూ ఆచరింపబడుతూ తన్మూలమున క్షాంతి అభ్యస్థమగుచున్నది. క్షమాశీలుడు కాకుంటే గృహస్థు పనికిరాడు. గాహన్‌స్థ్యమం దందరికీ ఆదర మున్నది; అందుచేతనే చనువుహెచ్చి కుటుంబములోని చాలామంది స్థిరచిత్తులు కానందున పొరపాటు లెన్నో చేయుచుందురు, వాటి నన్నిటినీ యజమాని క్షమించవలెను; లేకుంటే ఎవ్వరూ వానిదరికి