పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

173 వీరత్వము

                 1. అధీతం విధివద్దత్తం భూ: ప్రశా స్తం ససాగరా
                    మూర్ధ్నిస్థిత మమిత్రాణాం కోను స్వంతతరో మయా||

                2. యదిష్టం క్షత్ర బంధూనాం స్వధర్మ మనుపశ్యతామ్
                    తదిదం నిధనం ప్రాప్తం కోను స్వంతతరో మయా||

                3. ససుహృ త్సానుగశ్చైవ స్వర్గం గంతాహ మచ్యుత
                   యూయం నిహత సంకల్పా: శోచంతో వర్తయిష్యథ||

               1. చదివితి నెల్లవేదములు జన్నము లొప్పగ జేసితిన్ రమా
                  స్పదమగు వృత్తి బొల్చి నరపాలకు లెల్లను గొల్వ గంటి దు
                  ర్మదరిపు గాఢగర్వ పరిమర్దనకేళి యొనర్చితిం దగం
                  దుది నని మిత్రబాంధవులతో త్రిదివంబున కేగు టొప్పదే?

              2. సమరము శమంతపంచక సమీపమున ధర్మవృత్తి సలుపగ నత్యు
                  త్తమలోకము సమకూరెను విమలాత్ముడనైతి నింక వేయును నేలా?
                                                                      ....తిక్కన

పాండవులూ శ్రీకృష్ణుడున్నూ ఈలోకమును స్వర్గముగా నొనర్చిరనీ, వారికి స్వర్గమునకు పోవలయునన్న ఆందోళనమే లేక, స్వర్గముకన్న నెక్కువగు బ్రహ్మపదమును వారు పొంద యత్నించుచున్నారనీ ఆత డెరుగడు. మహాత్ముడగు ముద్గల ముని స్వర్గమునుండి వచ్చిన విమానము తుచ్ఛమని యెంచి జ్యోతిర్మయమగు బ్రహ్మపదము నాశించి జ్ఞానము శమము నవలంబనములుగా నొనర్చుకొనెను. అట్టి జ్ఞాన మార్జింపవలెననే పాండవులు ప్రాణములు బాయలేదు. ఇంకా వారు రాజర్షులు కాలేదు. జనక చక్రవర్తి వలెనే సంసారము వీడి భగవత్ప్రేమాసక్తులై, సిద్ధి పొందలేదు. అందుకే సకలరాజర్షి వృత్తాంతము శ్రీకృష్ణుడు ధర్మరాజు కుపదేశించెను, అట్టి యాదర్శము