పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155 వీరత్వము

క్షాత్రవీర్యమున్నూ ప్రకటితము లాయెను. కామక్రోథాదులు ప్రబలమూర్తుల ధరించి రావణదుర్యోధనరూపముల పృధ్వి నెల్ల అడలగొట్టి భూభారము నభివృద్ధి నొందించగా, వారిని నిర్మూలించి జయము గాంచడము క్షాత్రవీర్యము - ఇది బాహ్య సమరము, మన పురాణములయందు విస్తృతరూపమున వర్ణింపబడింది. శ్రీరామచంద్రుడు తన పౌరుషము నిలువబెట్టుకొనుటకున్నూ భూభారము తగ్గించుటకున్నూ రావణునితో యుద్ధ మొనర్చి కుల నిర్మూలము చేయడమువల్ల అతనిపే రాచంద్రార్కము సంస్మరణీయ మవుచున్నది. వనవాసదీక్షయం దాతని వశిత్వము వన్నె కెక్కినదని చెప్పితిమికదా?

ఈ ద్వివిధవీరత్వ మాతని కలవడుటకు అతని విద్యాభ్యాసము తపశ్చర్యమున్నూ ముఖ్యహేతువులు. అతనియందు ధైర్యము, శాంతి, విద్యాబుద్ధు లున్నట్లే అధ్యవసాయము, సాహసము, కర్మనిష్ఠ, వీరత్వమున్నూ కలవు. దశరథుని యందలి ధర్మపరాయణత, సత్యవ్రతమూ చూచి, వసిష్ఠాది ఋషులు తనకు నేర్పిన సంయమబలముచేత వినయసంపన్నుడై బ్రహ్మవీర్యప్రాప్తికి యోగ్యు డయ్యెను; అనన్యసామాన్యబల విక్రమసంపన్నుడై ధనుర్విధ్యాపారంగతు డౌటవల్ల క్షాత్ర వీర్యమున కునికిప ట్టాయెను. పూర్వకాలమున మనలో క్షత్రియుల కీరెండురకముల శిక్షయూ ఒసగుచుండేవారు, కావుననే రాజర్షు లనేకులు వెలువడుచుండిరి. సంజయుడు