పుట:Pranayamamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తులు వశపడును. స్నాయువులలో చైతన్యము వచ్చి, బాహ్య ప్రపంచ విషయములను తెలిసికొన గలుగుట, ఆంతరిక సంకల్పములను గురించి యోచింప గలుగుటలు ప్రాప్తించ గలవు, ప్రాణశక్తిని వశపరచుకొనుటయే ప్రాణాయామ మందురు. ఇట్టి ప్రాణాయామముచే తన ప్రాణశక్తిని లోబరుచుకొన్న వాడు, తననేగాదు తదితర ప్రపంచ మంతటిని జయించిన వాడగును. ఈ ప్రాణమే ఈ సృష్టికంతకు మూలాధారము. యోగి ప్రపంచమునంతను తన శరీరముగ తలచును. ఏలనన, తన శరీరము ఏ పంచ భూతములచే సృష్టింప బడినదో, ఆ పంచభూతముల చేతనే గదా ఈప్రపంచ మంతయు సృష్టింపబడుట! తన నాడీ మండలమును నడుపుచున్న ఆ మహత్తర శక్తియే, ఈ ప్రపంచము నంతను నడుపుచున్నదిగా తలచును. కావున, తన శరీరమును జయించుటవలన, తాను ప్రకృతి యందలి సమస్త శక్తులను జయించితి ననెడి భావముతో యోగి యుండును. హైందవ తత్త్వశాస్త్ర రీత్యా, ఈ ప్రకృతి యంతయు ఆకాశము (ETHER) ప్రాణము (ENERGY) అను ప్రధాన పదార్థములచే సృజింప బడినది. వీనినే యించు మించు, ఆధినికశాస్త్ర వేత్తలుచేప్పు, పదార్థము, శక్తి - అనవచ్చును. ఈ సృష్టియందలి స్థూల రూపమును దాల్చియున్న ప్రతి పదార్థము సర్వవ్యాపియగు 'ఆకాశ' పదార్థముచే సృజింప బడినదే. వాయు, ద్రవ, ఘన పదార్థములు, సమస్త సృష్టి, - అంతయు మన సూర్య సిద్ధాంత రీత్యాగాని, ప్రపంచమందలి ఎన్నో ప్రధాన సిద్ధాంతముల ననుసరించిగాని, ఈ ప్రపంచమున సృష్టింపబడిన ప్రతి పదార్థము, అగోచరమగు ఆకాశ ద్రవ్య సహాయము వలననే సృష్టింపబడ గలదు. అంతమున మరల ఈ ఆకాశ ద్రవ్యము