పుట:Pranayamamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననే చేరగలదు. ఇదే రీతిని, మానవునకు తెలిసియున్న అన్ని విధములగు ప్రాకృతిక శక్తులు ఆకర్షణ, ప్రకాశము, ఉష్ణము, విద్యుత్తు, చుంబన ఆకర్షణ శక్తి, పశుబలము, బుద్ధిబలము మొ) ఈ విశ్వప్రాణశక్తి నుండియే సృష్టింపబడినవి. అంతేగాదు, ఈ ప్రాణశక్తినుండియే జన్మించి, అందేలయమై పోవు చున్నవి. ఈ సృష్టి యందలి భౌతిక, మానసిక శక్తులన్నియు, అందే లయమగు చున్నవి. ఈ రెండు పదార్థములు లేకుండ నున్నవస్తు వేదియు ఈ సృష్టియందు లేదు. శక్తి నిత్యత్వము, పదార్ధ నిత్యత్వము అను, రెండుమూల సిద్ధాంతములు ప్రకృతియందు గలవు. ఈరెండు శక్తులలో ఆకాశతత్వము సృష్టించుటను (ఎల్లప్పుడు) చేయుచుండును; శక్తి, ఎడతెగకుండ యీ సృష్టింప బడిన పదార్థములకు చైతన్యము నిచ్చును. ఈ రీతిని శక్తి భిన్న భిన్న స్వరూపములలో చక్రమువలె తిరుగు చుండి, పున: బలిష్ఠ మగును; అదేరీతిని ఆకాశముగూడ, మరల, ఈ శక్తులు రెండవ చుట్టును ప్రారంభింప బోవునపుడు, భిన్న భిన్న స్వరూపములను కలిగించుటకై తిరిగి ఆకాశ తత్వముపై పనిచేయును. ఈ రీతిని, ఆకాశతత్త్వము మారిపోయి స్థూల సూక్ష్మరూపములుగా మారి నప్పుడెల్లను, ప్రాణశక్తికూడ అదే రీతిని స్థూల సూక్ష్మరూపములు గలదిగ మారును.

యోగి తనశరీరము నొక సూక్ష్మప్రపంచముగ నెంచి, నాడీవిధానము, ఆంతరి కేంద్రియములచే తన శరీరము నిర్మింప బడినదని తెలిసికొని, తన పరిశ్రమవలన వీటి మర్మముల నన్నిటిని కనుగొని, వీటి నన్నిటిని వశపరచుకొని, జగత్తునంతను జయించును.

ఇట్టి మహత్తరమైన ప్రాణమును వశపరచుకొనినవాడు, భౌతికజీవితము, భౌతికవిషయముల నన్నిటిని వశపరుచుకొన