పుట:Paul History Book cropped.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాంఛించాడు -ఫిలి 1,23. తనశరీరంలో క్రీస్తు ముద్రలు లేక శ్రమలు ధరించాడు -గల 6,17.

ఇంకా పౌలు తనలాగే క్రైస్తవులు కూడ క్రీసుతో ఐక్యమైయుండాలని కోరుకున్నాడు. జ్ఞానస్నానం ద్వారా వాళ్లకు ఈ యైక్యత ఇదివరకే సిద్ధించింది. దాన్ని వాళ్లు సఫలీకృతం చేసి కోవాలి. కనుకనే అతడు విూయందు క్రీస్తురూపం ఏర్పడిందాకా నేను మిమ్ముగూర్చి ప్రసవవేదన అనుభవిస్తున్నాను అని గలతీయులను హెచ్చరించాడు -4,19. అనగా గర్భవతి బిడ్డను కన్నటుగా తాను గలతీయుల హృదయాల్లో విశ్వాసరీత్యా క్రీస్తు శిశువును కంటాడని భావం. వాళ్ల హృదయాలు క్రీస్తుతో ఐక్యమైయుండాలని ఫలితార్థం. ఇంకా, విశ్వాసంద్వారా క్రీస్తు మినా హృదయాల్లో నివసించుగాక అని ఎఫెసియులను హెచ్చరించాడు -3,17.

ఉత్థాన క్రీస్తు తండ్రి కుడిచెంత ఆసీనుడై తన శక్తితోను బలంతోను విశ్వాసుల హృదయాలను నింపుతుంటాడు. వాళ్లు అతనివలన ప్రభావితులు ఔతారు. నడిపింపబడతారు. అతడు ఇచ్చేవాడు. వాళ్లు తీసికొనేవాళ్లు. పౌలుకీ క్రీస్తుకి వున్న ఐక్యతే మనకూ క్రీస్తుకూ కూడ వుండాలి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మనం అతన్ని ఓ దివ్యవస్రంలా ధరించాలి -గల 3,27. సంగ్రహంగా చెప్పాలంటే, క్రీస్తుతో ఐక్యమైన క్రైస్తవులు ప్రాత జీవితాన్ని వదలుకొని క్రొత్త జీవితం గడపాలి. తండ్రి వారిని అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి తోడ్కొనివచ్చాడు -కొలో 1,13.

2. తండ్రితో ఐక్యత

క్రీస్తుతో ఐక్యత సహజంగానే తండ్రితో గూడ ఐక్యతను చేకూర్చిపెడుతుంది. అసలు మన రక్షణ ప్రణాళికను సిద్ధం జేసింది