పుట:Paul History Book cropped.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతనితో ఉత్థాన మౌతుండాలి. మనం క్రీస్తుతో శ్రమలు అనుభవిస్తే అతనితోపాటు మహిమను పొందుతాం -రోమా 8,17. ఈ భావం పౌలుకి చాల ప్రీతికరమైంది. అందుకే అతడు క్రీస్తుతోపాటు శ్రమలు అనుభవించి, వుృత్యువునందు అతన్ని పోలివుండి, అతని పునరుత్థాన ప్రభావాన్ని అనుభవించాలని ఉవ్విళూరాడు. ఈ భాగ్యాలన్నీ తనకు క్రీస్తుపట్ల గల విశ్వాసంద్వారానే లభిస్తాయని నమ్మాడు. క్రీస్తుతో పోలిస్తే ఈ లోకవస్తువులన్నీ పెంటప్రోవులాగ విలువలేనివని భావించాడు -ఫిలి 3,8-11.

పౌలు తాను క్రీసుతో ఐక్యమయ్యాననీ క్రీసు శక్తిని పొందాననీ నమ్మాడు. ఈ యైక్యతను గూర్చి అతడు చాలాసారు చెప్పకొన్నాడు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. అతడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు -గల 2.19. క్రీస్తుతోపాటు చనిపోయి భూస్థాపితుడు అయ్యూడు -రోవూ 6,3-4. తన దేహంలో క్రీస్తుమరణాన్ని వహించాడు -2కొరి 4,10. క్రీస్తు శ్రమల్లో తానూ పాలుపంచుకొన్నాడు -2కొరి 15. క్రీస్తుతోపాటు తానూ ఉత్థానమై మహిమను పొందుతాడు -రోమా 6,8. క్రీస్తుతోపాటు తానూ మోక్షరాజ్యానికి వారసుడు ఔతాడు -రోమా 8,17. ఇంకా అతడు ఇప్పడు నేను గాదు, నాయందు క్రీస్తే జీవిసున్నాడు అని చెప్పకొన్నాడు -గల 2.20. నాకు జీవించడమంటే క్రీసుని జీవించడమే అన్నాడు -ఫిలి 1,21. క్రీస్తుతో పోలిస్తే లోకవస్తువులన్నీ పెంటప్రోవులాగ విలువలేనివని యెంచాడు -ఫిలి 3,8. క్రీస్తుని బోధించకపోతే తనకు పుట్టుగతులు వుండవనుకొన్నాడు -1కొరి 9,16. క్రీస్తుని ప్రేమించనివాడు శాపగ్రస్తుడు అని పలికాడు -1కొరి 16,22. డమస్కు త్రోవలో క్రీస్తు వేటకుక్కలాగ వచ్చి తన్ను పటుకొన్నాడు. తానిప్పడు క్రీస్తుని పట్టుకోవాలని అతని వెంట పరుగెత్తుతున్నాడు -ఫిలి 3,12. తాను చనిపోయిuప్రీస్తుని చేరుకోవాలని గాఢంగా