పుట:Nutna Nibandana kathalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరణానికి మమ్మ బాధ్యులను చేస్తున్నారు అని మండిపడ్డాడు. పేతురు ఏ మాత్రం జంకక, మేము నరులకు గాక దేవునికి విధేయులం గావాలి. దేవుడు అతన్ని వుత్థానం జేసి రక్షకునిగా నియమించాడు. ఇందుకు మేమంతా సాక్షులం అని పల్మాడు. అధికారులు అపోస్తలులను చంపివేద్దాం అనుకొన్నారు. కాని గమలియేలు అనే ధర్మశాస్త్ర బోధకుడు వారిని వారించి మీరు నా మాటలు వినండి. ఈ వుద్యమం మానవ ప్రేరితమైతే దానంతట అదే సమసి పోతుంది. దైవప్రేరితమైతే మనం దాన్ని అణచి వేయలేం. పైగా దేవునితో పోరాడినట్లు అవుతుంది. కనుక వేచిచూద్దాం. ఇప్పడు వారిని వారి యిష్టం వచ్చినట్లుగా బోధించ నీయండి అని చెప్పాడు. అతని సలహాను అందరూ అంగీకరించారు. అధికారులు అపోస్తలులను కొరడాలతో కొట్టించి యేసుని గూర్చి బోధించవద్దని ఆజ్ఞాపించి వదలిపెట్టారు. ప్రభువు కొరకు శ్రమలు పొందడానికి యోగ్యులమయ్యాం గదా అనుకొని సంతోషించి శిష్యులు అక్కడినుండి వెళ్లిపోయారు.

94. ఏడురు సహాయకులు -అచ 6

యెరూషలేములోని క్రైస్తవ సమాజంలో గొడవ యెదురైంది. గ్రీకు భాష మాటలాడే యూదులు తమ వితంతువులకు భోజనం సరిగా అందడం లేదని హీబ్రూ భాష మాటలాడే యూదులు మీద నేరం తెచ్చారు. అపోస్తలులు శిష్యులందరినీ ప్రోగుజేసి మేము వాక్యబోధను వదలివేసి నిత్యావసరాలను తీర్చడంలో మునిగిపోకూడదు. కావున మీలో యోగ్యులైన వారిని ఏడురుని ఎన్నుకొనండి. వాళ్లు భోజనాది విషయాలు చూచు కొంటారు. మేము వాక్యబోధకూ ప్రార్థనకూ సమయాన్ని వినియోగిస్తాం అని చెప్పారు. ఆ రాజీ మార్గానికి అందరూ సమ్మతించి సైఫను, ఫిలిప్ప మొదలైన ఏడురు పరిచారకులను ఎన్నుకొన్నారు. అపోస్తలులు వారిపై చేతులు చాచి ప్రార్థన చేసి వారిని పనిలో నియమించారు.