పుట:Nutna Nibandana kathalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92. అననీయ సఫీరాల కథ - అచ 5,1-11

యెరూషలేములో శిష్యులు ఉమ్మడి జీవితం గడుపుతున్నారు. అననీయ సఫీరా అనే దంపతులు పొలంఅమ్మి కూడబలుకుకొని కొంత సొమ్ము దాచుకొన్నారు. అననీయు కొంత మాత్రమే పేతురుకి సమర్పించాడు. పేతురు అతని మోసాన్ని గుర్తించి ఓయి! నీ సొమ్మ మీద నీకు పూర్తి అధికారం వుంది కదా? నీవు కొంత దాచుకొని దేవునితో అబద్ధమాడావు సుమా అన్నాడు. వెంటనే అననీయ క్రిందబడి ప్రాణాలు విడవగా అతన్ని పాతిపెట్టారు. అటుపిమ్మట భర్త చనిపోయాడని తెలియక సఫీరా వచ్చింది. పేతురు పొలం అమ్మగా మీకు వచ్చిన సొమ్ము ఇంతేనా అని అడగ్గా ఆమె యింతేనని బొంకింది. పేతురు మీరిద్దరుదేవుని ఆత్మను ధిక్కరించారు. నీ భర్తను కొని పోయిన వాళ్లు నిన్ను కూడ కొనిపోతారు అని పల్కాడు. వెంటనే ఆమె కూడ క్రిందపడి చనిపోగా పాతిపెట్టారు. ఈ సంఘటనను తెలిసికొని క్రైస్తవ సమాజమంతా భయపడింది.

93. అపోస్తలులకు శ్రమలు - అచ 5,12–42

అపోస్తలులు అద్భుతాలు చేసి వ్యాధులు నయంజేస్తున్నారు. పేతురు నీడపడినాచాలు వ్యాధి నయమాతుంది అనుకొని జనం రోగులను అతని దగ్గరికి తీసికొని వస్తున్నారు. యూదనాయకులు అసూయ చెంది అపోస్తలులను చెరలో పెట్టించారు. కాని రాత్రి దేవదూత చెరసాల తలుపులు తెరచి వారిని దేవాలయానికి వెళ్లి బోధించమని ఆజ్ఞాపించాడు. కనుక వాళ్లు వేకువనే దేవళంలో బోధ ప్రారంభించారు. ఉదయాన్నే మహాసభ సభ్యులు ప్రోగై అపోస్తలులు చెరలో లేరనీ, దేవళంలో బోధిస్తున్నారనీ తెలిసికొన్నారు.వారిని సభ యెదుటికి రప్పించారు. ప్రధానయాజకుడు మేము వద్దన్నా వినక మీరు యేసుని గూర్చి బోధిస్తున్నారు. ఈ పట్టణమంతా మీ బోధతో నిండిపోయింది. మీరు అతని