పుట:Nanakucharitra021651mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శముల గాలక్షేపము చేసెను. ఏసుక్రీస్తువంటి నీతివంతుని బరమభక్తుని సుగుణవంతుని వానిదేశీయులగు యూదులు నిర్హేతుకముగా గొరత వేయింపలేదే. మతముమాట యటుండనిండు ప్రకృతి శాస్త్రములలో గ్రొత్తసంగతులు కనిపెట్టిన వారికిగూడ నిట్టి యవస్థలే సంభవించినవికదా! "సూర్యుడు భూమిచుట్టు దిరుగుట లేదు. భూమియే సూర్యునిచుట్టు దిరుగుచున్న"దని కష్టపడి కనిపెట్టి యాసత్యము లోకమునకు వెల్లడించి నందుకేగదా బ్రూనోయను పశ్చిమఖండవాసుని వానిమతస్థులగు క్రైస్తవులు బ్రతికియుండగా వానిని నిప్పులలో బడవేసి చంపిరి. క్రొత్తదానిని లోకులు మొట్టమొదట నేవగించుట సహజము.

నానకు క్రొత్త సిద్ధాంతమేమియు జెప్పక పోయినను వానమతము పవిత్రమైన యార్యమతమైనను యానాటి దేశస్థుల యాచారమునకు విరుద్ధముగ నుండుటచే వానిని ప్రజలు ద్వేషించిరి. నానకు పరమశాంతుడైనను దత్పురజనులు వాని నెగతాళిచేసి చప్పటల జరచి యవమానించిరి. నానకునకు మర్దనునకు గూడ నక్కడనుండుట కిష్టము లేకపోయెను. గురుశిష్యులు తమతలంపు వడ్రంగి కెఱిగించిరి. అంత త్వరితముగ నేలబోవలసివచ్చెనని వడ్రంగి వారినడుగ నానకు, తనయునికి పురజనులకు బాధకరముగా నున్నందున వారికి మనోవ్యధ కలిగించుట కిష్టములేక తాను పోవలసివచ్చెనని ప్రత్యుత్తర