పుట:Nanakucharitra021651mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతనైనచో నిష్కారణముగ జంపివేయుదురు. ప్రపంచము యొక్క పూర్వచరిత్రం జదివినవారి కందఱకు నిది విదితమే. లోకులు క్రొత్తసిద్ధాంతములలో నున్న యోగు బాగుల నరయరు. దానివలన మానవకోటికి గల్గు లాభనష్టములను విచారింపరు. మునుపటి యాచారములకు విరుద్దముగ బోధించినవాడు నీతిమంతుడైనను సరే విద్యాసముద్రుడైనను సరే జ్ఞానరాసియైననుసరే యదియెల్ల లెక్కసేయక వానినెల్ల సిలుగులం బెట్టుదురు. ఈమాటల యధార్థ్యముస్థిరపరచుట కుదాహరణములు వేనవేలున్నవి. ఎందరో పరమపవిత్రులు మలిన చరిత్రలచేత సంహరింపబడిరి. ఎందరోవిజ్ఞానవంతులు పరమమూర్ఖులచేత బాధింపబడిరి. ఎందరో శాస్త్రకారులు నిరక్షరకుక్షలచేత నిందింపబడిరి. అద్వైతమతోద్ధారకుండగు శ్రీ శంకరాచార్యుడు మళయాళ బ్రాహ్మణులచేత నెన్నియిడుమల బడెనో మనము వినియుందలేదా! ఆయనతల్లి మృతినొందినప్పుడు కులబ్రాహ్మణులు శవదహనమునకు సహాయముచేయక మిన్నకుండ శంకరుడుగొడ్డలితో మాతృదేహమును ఖండఖండలుగాజేసి మోసికొనిపోవుటకువీలులేక తనదొడ్డిలోనేయగ్నిసంస్కారము చేసెనట. విశిష్ఠాద్వైత మతోద్ధారకుడగు రామానుజాచార్యుని చోళరాజు దేశమునుండి తరిమెనట. రామానుజు డారాజు చనిపోవువఱకు ననగా పండ్రెండు సంవత్సరములు తనమతము స్వదేశమున బోధింప వీలులేక విదే