పుట:Nanakucharitra021651mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకపూజ్యు డగుననియు లక్షలకొలది జనులకతడు మహోపకారము చేయగలవా డగుననియు రాజాధిరాజులైన వాని గీచినగీటు దాటక వినయమున మెలంగుదురనియు జెప్పి వాని ననునయించి పంపెనట. నానకుయొక్క చరిత్రకారులు జ్యోతిశ్సాస్త్రమునందు నమ్మికగలవారగుటచే బై పలుకులు పురోహితుడు చెప్పినను చెప్పకున్నను వానినోట బెట్టియుందురు. ఇక్కడికి నానకు పసులకాపరి తనమున కేగాక వ్యవసాయము చేయుటకుగూడ దగనివాడని తండ్రి విస్పష్టముగ గ్రహించి వాని నేవృత్తియందు బ్రవేశపెట్టి బాగుచేయనగునోయని కొంతకాలము విచారించి యేపనియందు నియోగింపకుండ నూరకయే గొన్నిసంవత్సరము లుంచినపక్షమున బాలుండు బాగుపడవచ్చునని వాని నైదుసంవత్సరములవఱకు యధేచ్ఛముగ సంచరింపుమని చెప్పెను.