పుట:Naayakuraalu.Play.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

45

గలిగింది. శ్రీ మలిదేవప్రభువు పెద్దవారయి రాజ్యనిర్వహణమునకు బూనుకొనేవరకూ దానిని రక్షించే భారము మనమీద వున్నది. భారము లన్నిటికంటే రాజ్యభారము దుర్భరము.

కొమ్మరాజు : అందుక నే 'రాజ్యాంతే నరకం ధృవ' మన్నారు.

బ్రహ్మ : అది యెంతయు సత్యము. ధర్మాధర్మాఃను నిర్ధారణ చేయడం దుష్కరం. దుష్టశిక్షణము, శిష్టరక్షణము చక్కగ జరిపినప్పుడే రాజు తన ధర్మమును నిర్వహించినవా డవుతాడు. అది చేయనినాఁడు ధర్మము నశించి, అధర్మము పెచ్చు పెరుగుతుంది. జనులు చెడునడతలలో దిగుతారు. వారి పాపమును రాజు పంచుకోవలసివస్తుంది.

కొమ్మ: రాజధర్మమును చక్కగా ఉపదేశించారు.

బ్రహ్మ : దుష్టులలోను, శిష్టులలోను చేర్పదగని దీనజనులను పరిపాలించడం రాజుయొక్క రెండవధర్మం "దుర్బలస్య బలం రాజా” అని బలవంతులు బలహీనులను బాధించకుండా రక్షించడము ముఖ్యకార్యము. భూమి ఏభారమయినా మోయగలదుగాని ధనికుడిభారము మోయలేదు.

కొమ్మ : తమ మంత్రిత్వమున మలిదేవుని రాజ్యము నిజముగ దేవరాజ్యమై వర్ధిల్లగలదని భావిస్తాను.

బ్రహ్మ: ఈ మహాకార్యము నా వొక్కడిచే నెరవేరేదిగాదు. సరదారులు, పరిజనులు తోడ్పడినప్పుడే యీ రాజ్యతరణి సౌఖ్యముగా ప్రయాణముచేయగలదు. రాష్ట్రమునకు ప్రజలు శరీరము ; ప్రభువు శరీరి. ఇవి రెండూ పొందిక గలిగి యుండినప్పుడే ధర్మనిర్వహణము కొనసాగుతుంది.