పుట:Naayakuraalu.Play.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు]

నేను లయకారకుణ్ణే అయినా నావల్ల లోకానికి శ్రేయస్సేకాని నష్టం లేదు. విలయమే వికాసానికి తోడ్పడుతుంది. రాయిని నశింపజేసి మొక్కను జేస్తా, చెట్లను పోకార్చి జంతువులను పెంపు జేస్తా, జంతుసృష్టిని వికసింపజేసి మనుష్యుణ్ణి చేస్తా, మనుష్యుణ్ణి పశుత్వములోనుంచి మానవత్వమునకూ, దానినుంచి దేవత్వమునకూ పెంపు జేయడమే నా పని.

అజ్ఞానం పశుత్వ చిహ్నం. లోకంలో అజ్ఞానం నశింపజేయడానికి బహుప్రయత్నాలు జేస్తున్నా, లోకములోని మతకర్తలూ, సంస్కర్తలూ, బోధకులూ నా పరివారములోని వారే. అజ్ఞానముతో పోరాడి గెల్చినవాడే ధన్వి. ముల్లోకాలను జయించినవానికంటె లోకములోని అజ్ఞానమును, ధనాంధతను, నిరంకుశత్వమును నిరోధించినవాడే వీరుడు. పల్నాటిరంగములో యీ యుద్ధముకూడా ప్రదర్శిస్తా

1 - వ రంగము

మాచర్ల - సభాభవనము

[బ్రహ్మనాయుడు, మలిదేవరాజు , సభికులు ప్రవేశము ]

బ్రహ్మనాయుడు : మిత్రులారా ! మన కిప్పటికి నిబ్బరము గుదిరింది. మాచర్ల రాజధానీనగర మయింది. మన ఆదర్శముల ప్రకారము రాజ్యముచేయడానికి అవకాశము