పుట:Naayakuraalu.Play.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

నాయకురాలు

కే: ఏమన్నారు రాజుగారు ?

న : మీతో జెప్పినవే నాకూ జెప్పారు. భాగము బుద్ధిపూర్వకంగా యివ్వలేదనీ, బెదిరించి బ్రహ్మనాయుడు మోసకృత్యంగా తీసుకొన్నాడనీ, తిరిగి పొందడం న్యాయమనీ, మూడే ముక్కలు.

కే: ఈ మాటలవల్ల ప్రయోజనం లేదు. తనకు రాజ్యం రావడం న్యాయమంటే యిచ్చిపోయేవాం డ్లెవరూ వుండరు. యుద్ధం జేయకుండా రాజ్యాలు రావు. దానికి తయారవుతారేమో గట్టిమాట కనుక్కోండి. తీరా మనమంతా సిద్ధం జేసుకొన్నతరువాత ఆయన తమ్ముడని కర్షిస్తే అభాసపనవుతుంది.

న: ముగ్గులోకి దిగితే వెనుకకుదీసేవారు గారు. జయము కలుగుతుందనిమాత్రం నచ్చజెప్పేవాండ్లు గావాలె. బ్రహ్మనాయుడు పూర్తిగా పిరికిమందు బోశాడు. యుద్ధమంటే ముందంజవేసేవాడు మంత్రి దొరకాలె.

కే : బ్రహ్మనాయుడినే మంత్రిగా వుండమని తిరిగి కోరుతున్నారటగా?

న: ఎవరు గోరారు ? ఇది రాజుగారికి దోచిన సలహా కాదు. అలరాజు కదుటా దిండునా బడకుండా వున్నాడు. తండ్రిని యిటు దీసుక రాలేడు. తాను మామను విడిచి పోలేడు. మామకు మగపిల్లలు లేకపోవడంచేత యే కాలానికయినా రాజ్యం తనకు వస్తుందనే ఆశ బాగావున్నది. అటుబోతే యీ అవకాశం బోతుందని భయం. ఎటూ పాలుపోక రాజీపెటకం బెడుతున్నాడు. చివఱకు అనుకొన్నంత అయింది. బ్రహ్మనాయుడు యువరాజుకు తాను రాజ