పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

45. ఆంజనేయ స్తవము

ఎవని శౌర్యము విన్న నెడదలోఁ జెయివెట్టి
         కలచి నట్టడలు రాకాసి మూఁక
ఎవ్వాని నుడివిన నెల్ల గంధర్వ కి
         న్నర సుర నాయకుల్నతులుసేతు
రెవ్వాని సడిగన్న నెల్ల భూతాదిక
         గ్రహము లెల్లపుడుఁ జీకాకుఁ జెందు
నెవని నామము విన్న నెంతయుఁ దమపాలఁ
         గలుగు వాఁడని భక్తగణము దలంచు

నట్టి దేవాది దేవు మహానుభావు
శంకర కుమారు భక్త కలంక హారు
రామకార్య విచారుఁ బ్రోద్దామసారు
నఖిల గుణవంతు, హనుమంతు నభినుతింతు

46. కామినీ గర్హ్యము

మదిమోహంబిడు చన్నులన్దలఁపఁగా మాంసంపుఁబెన్ముద్దలౌ
ముదమున్‌జూపెడి కన్నులన్దలఁప నెప్డున్ నీర్పుసుల్తావులౌఁ
గద! యక్కాంతను గూడువారలకు మోక్షంబిల్లయౌఁగీర్తిసం
పద శూన్యంబగు నంచు వేదవిదు లేపట్ల న్విచారింతురౌ

47. హనుమద్దండకము

శ్రీకౌంజరీగర్భవారాశిరాకాసుధాధామమూర్తీ! జగత్పూర్ణకీర్తీ! లసత్సత్య మార్గానువర్తీ! సురానీక సంతాపకృత్సర్వపూర్వామరౌఘాటవీ వీతిహోత్రా! దయాపాత్ర! గీర్వాణ రాజా బభూ యక్ష రాట్పన్నగ ప్రేత రాడర్చితోద్యత్ప్రభా వాంఘ్రియుగ్మా! దశస్యందనాపత్య భక్తాగ్రణీ! శ్రీ హనూమంత దేవా! నమస్తే! నమః