పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

కవికోకిల గ్రంథావళి


అని భార్య చెప్పినను ఒథెల్లో విచారింప లేదు. అట్లు విచారించిన అయాగో కుట్ర బయటబడును; డెస్ డెమోనా చావదు. ఈనాటకమున అట్లుగాదు. రాణావిచారించెను. విచారించుకొలఁది ఆతని సందేహము బలమగుచుండెను, ప్రత్యక్ష సాక్ష్యము దొరకినది. దానిని రాణా దృఢముగ నమ్మెను. అతఁడు న్యాయాధిపతివలె “నిష్పక్షపాతముగ” విచారించుచున్నానని యనుకొనెనేగాని సాక్ష్యమును మానేర్ష్యాసంక్షుబ్ధ చిత్తుఁడగు భతన్ వలెఁ దనముక్కునకు సూటిగ సమన్వయము చేసికొనుచుండెను. మొగలాయి, అందులోఁ దనకుఁ బ్రబలవిరోధి, తనయంతఃపురము జొచ్చి రాజపుత్ర కులమునకె కళంకముఁ దెచ్చెను. మానవంతుడగు క్షత్రియుని. చిత్త మెట్లుండును ? పదరక యోచించుటకుఁ దగియుండునా? ఇది భ్రాంతిగాదాయని యందురేమొ, అది భ్రాంతియని తెలిసినది యితరులకు, రాణా యథార్థమనియే గదా నమ్మియుండెను. అట్లయ్యు సహజముగ సంశయశీలుఁడు గాన తన్నుఁ దానె శంకించుకొనెను. అందఱు వెడలిపోయిరి' అని కుమారసింహుఁడు చెప్పినపుడు “అమాత్యులు, ప్రజలు, సైనికులు, మిరాసతీత్వమును సంశయింపరు. నేనేమైనఁ బొరపడితినా!” అని యొక్కింత ఆలోచించును. తత్ క్షణమె అగ్బరు అంతః పురమునుజొచ్చెనన్న స్మృతి ఆతని భావవీథినిఁ బిశాచనృత్యము గావించును. మనస్సులో సుడిగాలి రేఁగును; వేయి అగ్నిపర్వతములు ఒక్కుమ్మడి ప్రేలి యగ్నితప్త పాషాణద్రవమును బైకెగఁజిమ్మును. క్రోధానల జ్వాలలు ఊర్పులై బయటికి వెడలును; ఇఁక 'రాణా యెవ్వరి యభి