పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

261


మేమి? అవి కుంభునెట్టు సంక్షోభపెట్టినవి? అనువిషయములే మనకుఁ జర్చనీయాంశములు, అతిలోక మతావేశము, నిశ్చల వైరాగ్యముగల కులకాంత సామాన్యగృహస్థుల కుటుంబములో ఇముడదు. పతి యిష్టానుసారము వర్తింపకుండుట, గృహకృత్యములందు నిరాదరణము, పతి హృదయమును తన మాటలు ఎట్లు నొప్పించునో దెలిసికొన నేరక తాను విన్న సంగతి దాఁపరికములేక మాటలాడు అమాయకత్వము, విషయ పరాఙ్ముఖతచే అజ్ఞాతముగ నలవడిన తృణీకరణ భావము, మిరాశీలములోని రంధ్రములు. మిరామాటలు కొన్ని సామాన్య ధర్మ ప్రవచనములుగ నుద్దిష్టములయ్యును శాప ప్రాయములుగ నగపట్టును. ఈసంగతి మీరా యెఱుంగదు, బేడిసను గుఱించి చెప్పునపుడు “మీనరాజ, విధి యదృశ్యహస్తము వెనువెంట నంటి మృత్యుపదములకడకు నిన్నీడ్చు. నయ్యొ !' అనియు మఱియొకచోట “పాలనా దండశక్తి నశ్వరమటన్న పిడుగువంటి సత్యంబును వినెదవెపుడో” అనియు మీరా యన్న పుడు రాణా ఏవిధముగ సర్థము చేసికొనును?

రాణా పదరక యేల ఆలోచింపలేదు అను ప్రశ్న అవిచార మూలకము. కొందఱు విమర్శకులు రాణాను ఒథెల్లోతో సరిపోల్చిరి. పాత్రపోషణమునందుఁ జూపట్టు ఇతర భేదము లేకాక వారిరువురకు ఈ క్రింది భేదముకలదు: ఒథెల్లో యేమాత్రము విచారించినను ట్రాజెడి జరిగియుండదు. ప్లాటును కూలిపోయియుండును. డెస్ డెమోనాను ఒథెల్లో సంశయించు చుండెనేగాని అయాగోను ఒక్కక్షణమైన సంశయింప లేదు. “కాసియోకు నేను చేతిగుడ్డను ఈయలేదు....విచారింపుము"