పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

కవికోకిల గ్రంథావళి


పెళార్భటులతో మేఘములు గర్జించుచున్నవి. కుండపోతగా వర్షము కురియుచున్నది. కాని ఈ భౌతిక దౌర్జన్యమునకు గురియయి నిస్సహాయుడై బాధపడుచున్న మానవుడు ఆ చిత్రములో కనిపించని యెడల అది మానవ హృదయమును ఆకర్షించదు. కవులు అవలంబించిన రెండు పద్ధతులు రమణీయములై నను మానవ చర్వలకు సంబంధపడిన ప్రకృతి వర్ణనమె మరింత ప్రాణవంతముగను మనోహరముగ నుండును.

ఆధునిక కవులు చేసిన గొప్పమార్పు కథావస్తువునకు మానవస్వభావ చిత్రణమునకు సంబంధించి యున్నది. సామాన్య మానవ జీవితమునందు కూడ కవితార్హ మైన రసోత్పాదక ఘట్టములున్నవని రుజువుచేయు కావ్యములను రచించిరి. మానవస్వభావ చిత్రమునకు అవకాశముకలిగించి, పాలిపోయి ప్రాతపడ్డ కవితా సరస్వతి యొడలు క్రొత్త నెత్తురు పెట్టుటకు తోడ్పడిరి. అందుకు వారు మనకందరకు వంద్యులు. - ఆలిండియా రేడియోవారి సౌజన్యంతో.


__________