పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటికవిత - ప్రకృతిపూజ

213

అపతదిక్కాంత సైతము, అస్తమించు
అరుణబింబంబుతోఁ గన్నులవియఁజేయు
తనదు పూజారియిక్కట్లు తలచి కుంద
ఎఱ్ఱపుండాయెనొ యేమొ హృదయమనగ.

ప్రకృతిని మానవీకరింపక స్వాభావికముగ వర్ణించిన రచనలు ఆధునిక కవులు చేసియున్నారు. అట్టి రచనలు పూర్వ కావ్యములందును అచ్చటచ్చట గోచరించుచున్నవి. ఆ రచనలసంఖ్య తక్కువ అనియే చెప్పవచ్చును.

రమణీయ వస్తువులు తమంత తామే వర్ణనా యోగ్యములయ్యును అవి మానవచర్యలకు భిత్తికయయి కావ్యవర్ణనములో మిళితమైనప్పుడు మరింత సుందరముగ నుండును. మానవ నాటకరంగమునకు బాహ్య ప్రకృతి పరదావంటిది. ఇందుకు వివిధ దేశములలోని మహాకవుల రచనలే సాక్ష్యము.

ఈ రహస్యమును కవులేకాక చిత్రకారులును గ్రహించిరి. వారు కొండలను, పచ్చిక బయళ్ళను, వనములను, సెలయేళ్ళను మాత్రమే చిత్రించి తృప్తిపడరు. ఆ దృశ్వమును ప్రాణవంతము చేయుటకు, మేయుచున్న ఆవునో, పూవులుకోసికొనుచున్న పిల్లనో లేక చలన శీలమైన ఏదేని జంతువునో చిత్రింతురు.

సముద్రము తరంగ సుందరమయ్యు దానిలో నొక యోడ త్రుళ్ళింతలాడుచున్నట్లు చిత్రింతురు.

ఒక పెద్ద తుపాను వీచుచున్నది. చెట్లు నిర్మూలములగుచున్నవి. ఇంటికప్పులు ఎగిరిపోవుచున్నవి. పెళ