పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నమందుఁ దృప్తియుఁ దీరినదికాదు.

వనంబునఁ దపోవృత్తి వర్తించు సుబాహుండు సోదరుని రాజ్యపాలనవిధానంబు దెలిసికొని యతండు విషయాసక్తుండగుటకుఁ జింతించుచు నించుక యాలోచించి తిన్నగాఁ గాశీరాజునొద్దకుఁ బోయి యిట్లనియె.

దేవా ! నేను గువలయాశ్వుని పెద్దకుమారుండ. నేను జిన్నతనమునందు మతిచెడి దేశాంతర మరిగితిని. నాకు రావలసినరాజ్యంబు నా తమ్ముఁడు అలర్కుం డనుభవించుచున్నాఁడు. జ్యేష్ఠానుక్రమంబున ననుభవించుట న్యాయము. నీవు వాని మందలించి నారాజ్యము నాకిప్పింపు మని ప్రార్థించిన నయ్యెకిమీఁడు అలర్కు నొద్ద కప్పుడే యొకదూతం బంపించెను. అతండు రాజవాచకం బిట్లు చెప్పేను.

ఉ. చిన్నతనంబునందు భ్రమజెంది వనంబుల సంచరించి నీ
     యన్న సుబాహుఁ డిప్డు శరణాగతుఁడై భజియించె నన్ను సం
     పన్నుఁడ వౌట రాజ్య మది వానిది వానికి నిచ్చు టొప్పుఁ గా
     కున్న నిను న్మహాస్త్రముల నొంచి సుబాహు మహీశుఁ జేసెదన్ .

అని చెప్పుటయు నావార్తవిని యలర్కుండు మందహాసము గావించుచు నేమీ? కాశి రాజునకు నేనంత దేలికగాఁ గనంబడుచుంటినా? నాయన్న వచ్చి సౌహార్దంబున నన్ను రాజ్యమడిగిన నీయకుందునా? ఆతనినేల శరణునొందవలయుఁ గాశీరాజునకు నేను వెఱచి రాజ్య మిచ్చువాఁడను కానని చెప్పుము. నాయన్న వచ్చి యాచించిన నిత్తునని ప్రత్యుత్తరము బంపెను.

ఆమాటవిని సుబాహుం డోహో ! యభిమానముగల క్షత్రియుం డొరుల దేహి యని యాచించునా? అందులకు నే నొల్లనని పలికెను. అప్పుడు కాశిరాజు చతురంగబలపరివృతుండై యలర్కు పురమును ముట్టడించి సామదానభేదోపాయంబులఁ దత్సైన్యసమూహ