పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

375

ర్యచంద్రయమవాయువులచిహ్నముల. ధరించి ప్రజలఁ బాలింపవలయును. లోభమువలనఁగాని కామమువలనఁగాని యర్థమువలనఁగాని యెవనిమనసు ధర్మమును వీడకుండునో యారాజు స్వర్గమును బొందఁ గలఁడు. ఉత్పధమును బొంది ధర్మచ్యుతులైన ప్రజల స్వధర్మనిరతులం జేసిన నరపతి యిహపరసుఖంబుల నొందఁగలఁడు న్యాయముగాఁ బ్రజలఁ బాలించినరాజు తత్సుకృతమును బంచుకొనుచు అని తల్లి పుత్రునకు రాజనీతియంతయు నెఱింగించినది మఱియు నతండడుగ వర్ణాశ్రమ ధర్మంబులును సదాచారప్రకారంబులోనగు విశేషంబు లెన్ని యో యెఱింగించినది.

అలర్కుం డట్లు తల్లిచే శిక్షితుండై క్రమంబున సంప్రాప్త యౌవనుండై దారపరిగ్రహంబు గావించి పుత్రులంగని యాగములుచేసి పితృ శుశ్రూష గావింపుచుండె. ఋతుధ్వజుండును బెద్దకాలము రాజ్యము జేసి వార్ధకంబున నలర్కుం బట్టాభిషిక్తుం గావించె. మదాలసయు భర్తతోఁగూడఁ దపోవనంబున కరుగుచు నలర్కుం జీరి చివరమాట యిట్లు చెప్పినది.

వత్సా! ఈయుంగరము నీవ్రేల నుంచుకొని యుద్ధమువలనఁగాని బంధువియోగమువలనంగాని సమస్తవిత్తనాశనకరమగు విపత్తు సంభవించినప్పు డీయుంగరమును జిదియఁగొట్టి దీనిలో నిమిడ్చియున్న పత్రికలోని సన్ననిలిపితో నొప్పుశాసనమును జదివికొని తదుక్తరీతిఁ గావింపుము. అని యుపదేశించి యంగుళీయకమిచ్చి పుత్రుం దీవించి యాకాంచనగాత్రి భర్తతో దపోవనంబున కరిగినది.

అలర్కుండును బట్టభద్రుండై ప్రజలఁ బ్రజలపోలికం జూచుచుఁ బెద్దకాలము రాజ్యముగావించెను. ధర్మార్థకామాసక్తుండగు నయ్యలర్కున కనేకవత్సరంబు లొకదినమువలె వెళ్లినవి. విషయసుఖంబుల ననుభవింపుచున్న యతనికి వైరాగ్యోదయమైనదికాదు. ధర్మార్థోపార్జ