పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

21

జయభద్రునికి సిగ్గు మెండుగానున్నది. నాదగ్గరగూడ దలయెత్తి మాటలాడడు యీ రాత్రి వానినొక్కనిని సునీతి మేడకుం దీసికొనిపోయి అచ్చట జరుగవలసిన వినోదములు నడిపింపుము. పేరంటాండ్ర నెవ్వరిని రానీయను ఆయువతితో వచ్చిన వారెవ్వరేని యుండిన నుందురుగాక. నీవ యాతండు గాన నింత చెప్పుదాననని పలికిన నతండును సమ్మతించి పిమ్మట నతని వెదకెనుగాని యెందును గానబడలేదు. సుమిత్రుడు మిక్కిలి విస్మయము నొందుచు సునీతి చిత్రఫలకమును గైకొని యేకాంతముగా ననంగచంద్రిక యింటికిం బోయి ఆతని రహస్యముగా గూర్చుండబెట్టుకొని యాచిత్తరువు జూపుచు నిట్లనియె.

రాజపుత్రా! నీ చరిత్రము మిక్కిలి విపరీతముగా నున్నది. యెప్పటికప్పుడే యెద్దియో చెప్పి నన్ను మోసపుచ్చుచుంటివి వేశ్యలనగా నెటువంటివారో నీకు దెలియదు. చెప్పెదను వినుము.

శ్లో॥ వేశ్యా సౌమదనజ్వాలా రూపేం ధని వివర్జితా
      కామిభిర్యత హూయంతే యౌవనాని ధనానిచ ॥

రూపమనెడి సమిత్తులచే వృద్ధిపొందింపబడుచుండెడి మదనాగ్నియే వేశ్య. కాముకులు ఆజ్వాలయందు, తమ యౌవనములును ధనములును హోమము చేయుచుందురు. కావున వేశ్యాసంగమము దూష్యము. అదియునుంగాక నీభార్య రూపములో దీనికి సహస్రాంశములేదు. ఎన్నిసారులు చూడమన్నను నామె చిత్రఫలకమును జూచుటకే నీకు సమయము లేకున్నది. యిదిగో చూడుము యెంత చక్కగా నున్నదియో ఆహా! చతురాస్యుని నిర్మాణకౌశల్యమున కిది తుదికాదా! ఈలాటి పాటలగంధి వచ్చి మేడలో బ్రవేశింప నీక్షుద్రకాంత నిశాంతమున వసియింప నీకు బుద్ధి యెట్లొప్పుకొనెనో తెలియదు. ఒక్క సారి వచ్చి నీమేడం జూ కొనుము దాని నీదివసమున నింద్రభవనము లాగున నలంకరించిరి. మీ తండ్రి అన్నలతోగూడ మిత్రకార్యముమీద నరిగెను. మీతల్లి నీరాక వేచియున్నది ఈ రాత్రి నీమేడలో మంచి యుత్సవములు చేయుదురు. భార్యలేనివాని కిట్టిపాట్లుకాని నీకేల. వడిగా పోవుదము రమ్ము చిత్రఫలకములో నున్నవిషయములకన్న నాచిన్నదానియం దెక్కుడువిశేషము లున్నవని మీ తల్లి నాతో చెప్పినది. గాన పట్టణములోనివారెల్ల నప్పల్లవపాణి సోయగము నద్భుతముగా జెప్పకొనగా, నేను కంటినని యెన్నియో నీతు లుపదేశించెను.

జయభద్రుండామాటల కేమియు సమాధానము సెప్పక యాచిత్రఫలకము మాత్రము సాలాభిలాషగా జూచిచూచి తలయూచుచు, వయస్యా! యాచిన్నది నిజముగా నిట్లున్నదా! అట్లయిన నీరాత్రి దప్పక వచ్చెదను. నామాట నమ్ముము. నీవు ముందు నడచి అచ్చట జరిగించవలసిన కృత్యములు కావింపుచుండుము. ఇంతలో నీ కాంతను సమాధానపఱచి నేను వచ్చెదను. అనంగచంద్రికను లోకసామాన్యగణికగా దలంపవలదు. దానికి నాయందుగల మక్కువ యీపాటిదని చెప్పనేరను. నీవు