పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడు సుమిత్రుండు పెక్కుతెఱఁగుల దలపోయుచు నింటికిం జని వారికా రహస్యము తెలియనీయక సునీతిం బెండ్లియాడుటకు జయభద్రుండు సమ్మతించెననియు ముహూర్తము నిశ్చయించి శుభలేఖ వ్రాయవలయునని రాజుగారితో చెప్పెను.

ఆభూపతి దైవజ్ఞుల బిలిపించి ముహూరము జూడుడన నమ్మరునాడే మంచి ముహూర్తమున్నదని చెప్పిరి. అప్పుడారాజు శుభలేఖతోడనే కూలాచారప్రకారము మంత్రిసామంతాదిపరిజనంబులతోఁ గూడ విచ్చేసి వివాహము చేసికొని రమ్మని చెప్పెను. ముహూర్త మవ్యవధిగా నుండుటచే నాపరిణయప్రయత్న మంతయెక్కుడుగా జరుగలేదు, నాటిరాత్రి సుమిత్రుడు జయభద్రునొద్దకు పోయి వివాహవిశేషము లన్నియు జెప్పియింతవరకని చెప్పి మరునా డుదయంబున దప్పక వత్తునని యతనితో బ్రమాణికము

సుమిత్రుడు మరునా డుదయకాలంబున జని జయభద్రునిం జేరి అయ్యో! యింతమూఢుండవైతి వేమి? ని న్నీదినము బెండ్లికొడుకును జేయవలెనట. ఎన్నినాళ్ళు బొంకుదును. ఇప్పుడు రాకపోదువేని యీగుట్టు దాగదని యెన్నియో చెప్పిన విని యతం డెట్టకే గదలి వానివెంట నందు విద్యామందిరమునకుం జనియెను.

అంతకుఁ బూర్వమే యతనిని బెండ్లికొడుకుం జేయ దీసికొనిపోవుటకై వచ్చిన రాజకింకరులం జూచి బెదరుచు గండ మెద్దియో చెప్పి సుమిత్రునితో గూడ గోటలోనికిం బోయెను.

తల్లిదండ్రు లతని మిక్కిలి గారవించుచు మంగళస్నానములు చేయించి బ్రాహ్మణాశీర్వాదపురస్సరముగ వివాహమంగళకార్యంబుల దీర్చిరి. అతండున్మత్తునిక్రియ బ్రవర్తించుచుండ నాకొరల కేమియుం తెలియకుండ సుమిత్రుండు గాపాడుచుండెను. మరియు వివాహాదిదినమున గూడ నెప్పుడో సమయము చేసికొని యనంగచంద్రిక యింటికిం జనుచుండ నాగుట్టు బయల్పడకుండ సుమిత్రుండు వోయి అతని వెంబడియుం దీసికొని వచ్చుచుండెను.

ఈ రీతి నాలుగుదినములు గడిసినంత నైదవనాడు సునీతి మిక్కుటమగు సారెతో అత్తవారింటికి వచ్చినది. ఆచిన్నది తెచ్చినసారెఁ జూచి పౌరులు వెఱగుపడజొచ్చిరి. అంతకుం బూర్వమే యాసునీతి నిమిత్తము జయభద్రున మేడ నలంకరించి యుంచిరి. అపూబోడి యాసామాగ్రితో నామేడలో బ్రవేశించినది.

ఆదివసంబుననే కుంతిభోజునకు మిత్రుడైన యొకరాజు శత్రువులచే నోడింపబడి తనకు సహాయము రమ్మని కుంతిభోజునకు వార్త నంపగా నారాజు నార్గురపుత్రులతోగూడ సైన్యముల దీసికొని అచ్చటికిం బోయెను. జయభద్రుం డాయలజడిలో దన్ను విమర్శించువారు లేరని రహస్యముగా అనంగచంద్రిక యింటికిం జని యధేష్టకామసౌఖ్యముల బొందుచుండెను.

పాయంకాలము జయభద్రుని తల్లి సుమిత్రునిం బిలిపించి వత్సా! యీ