పుట:Haindava-Swarajyamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222

హరిశ్చంద్రోపాఖ్యానము

సివ్వంగి లేడి వీక్షించుచందమునఁ
క్రొవ్వునఁ జూచి కర్కోటకు మాట
లన్ని యు నిజముగా నాత్మ భావించి
పన్ని నకోపంబు బలసి రెట్టింప
బలి భిక్షములవారి బలువిడి మొత్తం..............................1100
దలసాలఁ గట్టినతన వేలుదుడ్డు
వడిఁ గేలఁ గైకొని వచ్చునజ్జఱభి
'గడఁగి వీక్షించి యక్కాల కౌశికుఁడు
గుండె భగాలనఁ గొలఁది యె తనకుఁ
'బండె నెక్కడఁ జొరఁ బాఱనె' ట్లనుచు
వెడ వెడఁ దన కచ్చ వీడంగఁ బారి
వడి మోము వగులఁ గవాటంబు దాఁక
గడియతో, బెనఁగి దిగ్భమఁ దత్తజింపఁ
‘బొడువ నీ కెక్కడఁ బోవచ్చు' ననుచు
బెక్కు భంగుల మొజ్జఁ బెట్టంగ వెట్టి................................1110
కుక్క లోఁబడఁ బట్టి కొట్టిన రీతిఁ
' జేతు లొగ్గుచు మొక్కుఁ జేకొను' మనుచు
నాతురంబున వేఁడ నందంద మొ త్తి
వడి చెడి దగ దొట్టి వఱద లై చెనుట


......................................................................................................

గానిబిచ్చము గాని అడుగవచ్చువారిని, బలువిడి = బలముగా, మొ త్తన్ =కొ ట్టుటకు, వ్రేలుదుడ్డు = వ్రేలాడుచున్న దుడ్డుక ర్రజ, జఱభి=దుష్ట స్త్రీ, 'గుండె... బండె' గుం డెభ గాలని యదురునంతమాత్రమై కార్యము ముగిసినది, ఎక్కడం జొరబాఱ నెట్లు = ఎక్కడబ్రవేశింపవచ్చును ఎట్లు పాఱిపోవచ్చును అని, వడి చెడి. అలసట చే కొట్టెడియురవడి తీసిపోయి, దగదొట్టి=దప్పినొంది, పఱదలై