పుట:Haindava-Swarajyamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

221

ద్వితీయ భాగము.

మెదుక పట్టినతల మెడ గండమాల.................................1080
నుదుటిమీఁదటిసుడి నులిగొన్న బొమలు
బుర్ర ముక్కును లొట్ట పోయినగన్ను
వెట్టి చూపును దెగి వేలాడు చెవులు
మిడిపండ్లు చెక్కిలి మీఁదిపుల్పిరియుఁ
బడి వేలుచన్నులు బడ బాకినోరు
రోటు పోయిన చెయ్యి రొమ్ము కంపరము
వాటుఁగాలును రోలువలె నున్న నడుము
బద్దుపిక్కలు నంట బలసిన తొడలు
మొద్దుపాదంబులు ముడిఁగిన వ్రేళ్లు
గఱుకునల్ల నిమేను గలిగి దయ్యంబు.............................1090
మఱపింపఁ దగు నుచ్చమల్లిచందమునఁ
గనుఁగొన రోఁతైనకాల కౌశికుని
వనిత హుమ్మనుబందివాటులమాతం
గని దానిఁ గదియ బెగ్గల మంది వెఱచి
వెనుకకు జరుగు నుర్వీవిభు దేవి


............................................................................................................

“మొగిచి =మోడ్చి, మెదుక పట్టిన = పిసక గానున్న, నులిగొన్న = చిక్కు పడిన, బడబాకినోరు = పెద్ద వెడఁదనోరు, రోటుపోయిన ఈచఁబోయిన, కంపర ము=పాడే, వాటుఁగాలు = నడుచునప్పుడు ప్రక్కవాటు గాఁబోవునట్టి కాలు, బద్దుపిక్కలు=పలుచనిపిక్కలు, అంట బలసిన=నిలు వెల్లబలుపునొందిన - చక్క దనమునకు అనుగుణముగా అయ్యెభాగములందు ఎక్కువతక్కువలుగా బలుపు నొందక ఒక్కటే మొద్దు గా బలసియున్నట్టి యనుట, కఱుకు బిరుసైన, ఉచ్చమల్లి = దిస్స మొలయాఁడుది, హుమ్మను బందివాటులమాత= బందివాటుదొం గల తల్లివలె హుమ్మనుచు బెడిదముగా నుండునది, బెగ్గలమంది = భయపడి, ఉ ర్వీవిభుదేవి = రాజు భార్య, చివ్వంగి= సివంగి, బలిభిక్షముల వారిన్= - బలి.