పుట:Gurujadalu.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(అసిరిగాడు ప్రవేశించి.) అసిరి : (బుజ్జి గోకుకుంటూ) బాబు, మా ముసల్గోనికి సాలొచ్చిందట - కబురెట్టింది బాబూ. హెడ్డు :

వెధవా, సాక్ష్యం యివ్వందీ వెళ్లిపోతావా యేమిటి?

అసిరి : సాచ్చికం అయిందాకా బతికుంతాదా బాబు? హెడ్డు : ఓరి వెధవా, దొంగమాటలాడుతున్నావు గుండె పగలగొడతాను. నీకెవడ్రా కబురు తీసుకొచ్చాడు? అసిరి : మనవూరు బండ్భోచ్చినారు బాబు. హెడ్డు : గాడిద కొడకా, యిల్లు కదిలావంటే వీపు పెట్ల గొడతాను. అసిరి : యెళ్లితే మీరు తంతారు, యెళ్లకుంటే అరుతంతారు. హెడ్డు : ఆరెవట్టా? అసిరి : యినీసిపిక్కడోరు. హెడ్డు : యీ యినస్పెక్టరు మరి సాక్ష్యం రానివ్వడు! గిరీశం: అసిరీ నా దెబ్బ నీకు తెలుసును - యిన స్పెక్టరు, గినస్పెక్టరూ జాంతేనై. విన్నావా? తిన్నగా బోనెక్కి నిజవేఁదో సాక్ష్యం పలక్కపోతివట్టాయనా, పీక నులివేఁసి నిన్ను నూతులో పారేస్తాను. అసిరి : యేటిబాబూ! మీరోతెన్నా, ఆరోతెన్నా, యీరో తెన్నా, నాకేటెరిక బాబు? మీ నౌకరీకి దణ్ణం. పోతాను, బాబూ. ఆయమ్మ గోడగెంతడం నాను సూపులేదు బాబూ- గవరయ్యగోరు దెయ్యాన్ని సీసాలో యెడితే, గోడ గెంతడం యేటి బాబు? వొట్టి అబద్దం! నాను సూపు లేదు బాబు. గిరీశం: వాడు చూడందీ సాక్ష్యం యలా పలుకుతాడు, అన్నయ్యా? లుబ్ధి : నా పాలుబ్ధం - యేవఁని జెప్పను? హెడ్డు : యవరీయనా? కేసుల మొహం అంటే యీయనకేమైనా తెలుసునా?

కేసుల మొహం నాకూ తెలియదు, నిజం మొహం పోలీసువాళ్లకీ తెలియదు. అబద్ధ

సాక్ష్యాల వల్ల తప్పించుకోవడం కన్న, జెయిల్లో కూచోడవేఁ ఉత్తమం. ధన ప్రాణాలు రొండూ పోయినా, మనిషి అన్నవాడు అసత్యం ఆడకూడదు ఆడించకూడదు. హెడ్డు : యేవిఁటండీ ఈయన శల్య సారధ్యం! యవరితడు? గురుజాడలు 402 కన్యాశుల్కము - మలికూర్పు