పుట:Gurujadalu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

. గిరీ

మీకే కనపడ్డదా?

హెడ్డు : నాకెలా కనపడుతుంది? పాపం పుణ్యం యెరగని చిన్న పిల్లవాళ్లకే కనపడుతుంది. గిరీ : లోకం అంతటా పూరియళ్లూ కుక్కి మంచాలూ వుఁన్నవి గదా, యేవూరని పోల్చడం? హెడ్డు : ఈ రాత్రి మళ్ళీ అంజనం వేసి వూరు పేరు చెప్పిస్తానన్నారు. గిరీ యవిడెన్సు ఆక్టులో అంజనాలూ, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా? హెడ్డు : ఆ బైరాగీని మీరెరగరు; ఆయన గొప్ప సిద్ధుడు - యేం జెయ్యాలంటే అది చెయ్యగల్డు. అతడు పక్కని వుంటే నాకు కొండంతం ధైర్యం వుండేది. జగన్నాధ స్వామిని సేవించుకుని సాయంత్రానికి ఆయనవొస్తే, నేను అదృష్టవంతుణ్ణి. గిరీ : పది రోజులు ప్రయాణం గదా, ఒక్క రోజుకి పోవడం రావడం యలాగ? హెడ్డు : ఆయనకి వాయు వేగం వుంది. దుకా : అప్పులాళ్ళు అగుపడితే, వాయువేగంగా యెగేస్తాడు నా బాకీ వొసూలు చేసుకోనిచ్చినారు కారు గదా భాయీ! హెడ్డు : వెధవబాకీ - యీ గండం తప్పితే, నేను యిచ్చేస్తాను భాయీ. దుకా : గండం తప్పేదేటి, నా సొమ్ము నా చేతులో పడేదేటి భాయీ? హెడ్డు : మీ అందరిసాయం వుంటే దాటకేం భాయి? దుకా : ప్రాణం పెడతాను భాయి, సాక్షం మాట మాత్రం శలవియ్యకండి? హెడ్డు : సాక్ష్యం పలకరా యేవిఁటి? దుకా : దుకాణవేఁసుకు బతికేవాళ్ళకి సాక్షికాలెందుకు భాయీ? ఈ తిరగడం నించి బేరం చెడ్డాది. యీ వేళ వూరికి పోకుంటే దుకాణం యెత్తి పెట్టాలి. హెడ్డు : యిదేనా మీ స్నేహం, నేస్తం? దుకా : మీ వెంట తిరిగితే, కొత్త మోడ్డు గారు హెడ్డు : కొత్త హేడ్డేవిఁటి భాయీ? దుకా : యినసిపికటరు గారు, చెప్పినారు. నా సొమ్ము మాటేటిభాయి? హెడ్డు : యినస్పెక్టరు గాడు అన్నిందాలా నా కొంప తీశాడు! దుకా : ఆ బైరాగాడు నాకొంప తీసినాడు. యిహ నా డబ్బు నాచేతులో పడేదేటి? (నిష్క్రమించును) గురుజాడలు 401 కన్యాశుల్కము - మలికూర్పు