పుట:Gurujadalu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ : కేసు గెలవడము కేమీ అభ్యంతరము లేదు. మీకు తెలియడముకోసం గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీ విషయమై యెంత శ్రమయినాపడి అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు.

అగ్నిహో : యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే చాలును. పెళ్లిపనులకి మీరు కుమ్మక్కు వుంటేనేకానీ తూగదుసుమండీ. నామీద కోపంచాత కరటకశాస్రుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లు వొచ్చేటట్టు కనపడదు.

గిరీశ : మీరు కూర్చున్న దగ్గరనుంచి కాలు కదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను చేస్తాను కాదూ.

(నిష్క్రమించుచున్నారు)


***

రెండవస్థలము - రామచంద్రపురం అగ్రహారములో లుబ్ధావధానుల యిల్లు.

(కరటక శాస్త్రి, పురోహితుడు ప్రవేశించుచున్నారు)

కరటక: పంతులు వచ్చేలోగా కార్యమైపోవాలి.

పురోహి: ఆ పూచీనాదీ - మీ రిస్తానన్న రూపాయిలు నాచేతిలో పడేయండి.

(కరటకశాస్త్రి ఆయన చేతిలో పదిరూపాయిలు పడవేయును)

పురోహి: లుబ్ధావధానులుగారూ! వేగిరం స్నానాలు కానివ్వండి.

లుబ్ధావ: పెద్దమనుష్యులింకా రాలేదే?

పురోహి: లగ్నం పెద్దమనుష్యులకోసం ఆగుతుందయ్యా? అగ్రహారంలో బ్రాహ్మణులందరినీ పిలిచాను. వచ్చి పందిట్లో కనిపెట్టుకొని కూర్చున్నారు.

లుబ్దా : పంతులు వుదయం నాలుగడియలకి ముహూర్తమని చెప్పాడే?

పురోహి: పంతులు చెప్పినమాట చూస్తారా - పంచాంగం చూస్తారా?

లుబ్ధావ: ఆ-ఆ-పంతులు నాలుగ్టళ్ల పొద్దుకు రమ్మని పిలుస్తానన్నాడే పెద్దీపాలెంలో లౌక్యుల్ని?

పురోహి: నేను నాలుగు ఘడియలకి తెల్లవారుతుందనగా ముహూర్తమని చెప్పాను. పంతులు నాలుగు ఘడియలు తెల్లవారిన తర్వాతనుకున్నాడు కాబోలు.

లుబ్ధావ: అయితే కానీయ్యండి స్నానానికి లేస్తాను

గురుజాడలు

168

కన్యాశుల్కము - తొలికూర్పు