పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



4. దేవుడు అబ్రాహాము సంతానాన్ని కరుణించాడు

దేవుడు అబ్రాహాముకిచ్చిన దీవెనలు అతని సంతానంలోకిగూడ దిగివచ్చాయని చెప్పాం. అతడు యిష్మాయేలుని గాక యూసాకునే యెన్నుకొన్నాడు. ఏసావనిగాక యాకోబునే ఎన్నుకొన్నాడు. దేవుని దీవెనలు అబ్రాహాము ఈసాకు యాకోబులద్వారా పండ్రెండు తెగల యిప్రాయేలీయులమీదికి దిగివచ్చాయి. ఈ తెగలవాళ్ళు ఐగుపులో బానిసలై దైవసహాయం కొరకు రోదిస్తూవుంటే ప్రభువు పూర్వం అబ్రాహాము ఈసాకు యాకోబులతో చేసికొనిన నిబంధనను గుర్తుకుతెచ్చుకొని వారిని కరుణించాడు - నిర్ణ 2, 44. ఆలాగే బాబిలోనియాకు బందీలుగా వెళ్లిపోయిన యిప్రాయేలీయులు దైవసహాయాన్ని అర్ధిస్తే ప్రభువు వారి మొర ఆలించాడు. ఎందుకంటే వాళ్ళు తన స్నేహితుడైన అబ్రాహాము వంశజులు - యొష 41,8. ఇస్రాయేలీయులు అపాయాల్లో బాధల్లో చిక్కుకొని నిరుత్సాహం చెందినపుడు ప్రవక్తలు మీరు ఏరాతినుండి పగులగొట్టి తీయబడ్డారో, ఏగనినుండి తొలవబడ్డారో ఊహించండి మీ తండ్రియైన అబ్రాహామునీ మీకు జన్మనిచ్చిన సారానీ తలంచండి

అని వోదార్చారు - యెష51, 1-2 యూదులు తమ ప్రార్థనలో దేవా! నీవు నీ సేవకుడైన అబ్రాహాముని స్మరించుకొని మాకు దయజూపు అని మనవిచేసేవాళ్ళు అతని పేరు మీదిగా చేసిన ప్రార్థన ఫలిస్తుందని నమ్మేవాళ్ళు. ఈవిధంగా ప్రభువు అబ్రాహాము భక్తివిశ్వాసాలనుబట్టి అతని సంతతిని కరుణించాడు. 

5. కేవలం శారీరక సంతానం ఐతే చాలదు

యూదులు అబ్రాహాము మధ్యవర్తిత్వంద్వారా తాము దేవుని అనుగ్రహానికి పాత్రులుకావచ్చుననుకొన్నారు. కాని వాళ్ళకేవలం శారీరకరీత్యా అబ్రాహాము సంతానమైతే చాలుననుకొన్నారు. అధ్యాత్మికరీత్యాగూడ అతని సంతతి కావాలనుకోలేదు. అనగా అబ్రాహాము విశ్వాసాన్ని తామూ ప్రదర్శిస్తూ దేవునికి ప్రీతిపాత్రులు కావాలని తలంచలేదు. కనుకనే స్నాపక యోహాను మీరు అబ్రాహాము మాకు తండ్రి అని పొంగిపోకండి. మీరు శారీరకంగా మాత్రమే అతని సంతానం. దీనివల్ల ఒరిగిందేమీ లేదు. దేవుడు ఈ రాళ్ళ నుండిగూడ అబ్రాహాముకి సంతానాన్ని కలుగజేయగలడు. మరి మీ గొప్పేమిటి? కనుక మీరు ఆధ్యాత్మికంగా అతని సంతానం కండి అని మందలించాడు - మత్త 3,9. ధనికుడు లాజరు కథలోని ధనికుడు అబ్రాహామునిజూచి తండ్రీ అబ్రాహామూ! నన్ను కరుణించు 204