పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11.బైబులు భక్తులు

బైబులు భాష్యం 100-101

విషయసూచిక

1. అబ్రాహాము 201
2. హేబెలు 208
3. నోవా 210
4. మెల్మీసెదెకు 213
5. యెహోషువ 215
6. ఏలీయా 218
7. మోషే 222
8. దావీదు 227
9. స్నాపక యోహాను 230

1. అబ్రాహాము

ఒక్క యూదులకేగాక, యావే ప్రభువుని విశ్వసించే భక్తులందరికీ అబ్రాహాము తండ్రి. విశ్వాసరంగంలో అతడు మనకందరికీ నిదర్శనం.

1. అబ్రాహాము పిలుపు

అబ్రాహాము కాల్డియా దేశీయుడు. ఊరు పట్టణ వాసి. క్రీస్తు పూర్వం 19వ శతాబ్దంలో జీవించినవాడు - ఆది 11,31. ఓ దినం ప్రభువు అతనికి ప్రత్యక్షమై "నీవు నీ సొంత దేశాన్నీనీ చుట్టపక్కాలనూ వదలి నేను చూపే దేశానికి రా. నేను నిన్ను మహా జాతిగా తీర్చి దిద్దుతాను. నిన్ను ఆశీర్వదిస్తాను. భావికాలంలోని జనులు నీలాగే తామూ ఆశీర్వాదాలు పొందాలని కోరుకొంటారు. నిన్ను దీవించేవారిని దీవిస్తాను. శపించే వారిని శపిస్తాను. నీ ద్వారా నేను సమస్త జాతులకు దీవెనలిస్తాను” అని పల్మాడు - ఆది 12, 1-3. ఈ వాక్యాల్లో మూడు ప్రధానాంశాలున్నాయి. 1. అబ్రాహాముకి దేవుడు ఓ క్రొత్త దేశాన్నిస్తాడు. 2. అతడు సంతానం తామరతంపరగా వృద్ధి చెందుతుంది. 3. దేవుడు అతన్ని నిండుగా దీవిస్తాడు. అతని ద్వారా అన్ని జాతులు దీవెనలు పొందుతాయి. ఈలా అబ్రాహాము కథంతా సంగ్రహంగా పై వాక్యాల్లో ఇమిడివుంది. అతడు స్థిరనివాసం లేని