పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యూదితు పురజనులతో యెరూషలేము వెళ్ళి దేవాలయంలో కానుకలు అర్పించింది. భర్త మన ప్లేను స్మరించుకొంటూ జీవితాంతం వితంతువుగానే వుండిపోయి పండు ముసలితనంలో చనిపోయింది.

3. వివరణం

1. అస్పిరియనుల దాడి 1, 1=3, 10

అస్పిరియా రాజు నెబుకద్నెసరు యుద్ధంలో తనకు సహాయం చేయనందుకు పశ్చిమ దేశాలను శిక్షించడానికి తన సైన్యాధిపతియైన హోలోఫెర్నెసును పంపాడు. వాటిల్లో యిస్రాయేలు దేశం ఒకటి. వారి నగరమే బెతూలియా, అస్సిరియా రాజు తొనొక దేవుణ్ణనుకొని యూదులు కొలిచే యావే దేవుణ్ణి ఎదిరించాడు. నెబుకద్నెసరు మానవ ప్రతినిధి హోలోఫెర్నెసు, యావే ప్రభువు మానవ ప్రతినిధి యూదితు.

సేనాపతి ఒకలక్షముప్పయి రెండువేల మందితో గూడిన బ్రహ్మాండమైన సైన్యంతో వచ్చి చిన్నగ్రామమైన బెతూలియాను ముట్టడించాడు. ఈ యుద్ధంలో ఇద్దరు దేవుళ్ళు ఒకరినొకరు ఎదిరించారు. రాజుది మానుషబలం. యూదితుది దైవబలం. పశ్చిమ దేశాల్లో శత్రువుని ఎదిరించింది యిస్రాయేలు దేశమొక్కటే.

2. బెతూలియా ముట్టడి 4, 1–7, 32

హోలోఫెర్నెసు బెతూలియా ప్రక్కన శిబిరాన్ని పన్నాడు. ఆ శిబిరాన్ని చూచి యూదీయులు భయపడ్డారు. యెరుషలేము నగరానికీ, దేవాలయానికీ ప్రమాదం కలుగుతుందని దడిసారు. వాళ్ళు శత్రువులు తమ దేశంలోకి ప్రవేశించే కనుమలకు కాపు పెట్టారు. ప్రార్థనలు, ఉపవాసాలు చేసి దైవానుగ్రహంతో యుద్దానికి సిద్ధమయ్యారు.

శత్రుసేనాని తన శిబిరంలో మంత్రాలోచనం జరిపాడు. అతడు యిస్రాయేలీయులు ఎవరని ప్రశ్నింపగా అమ్మోనీయుల నాయకుడైన అకియోరు వారి పుట్టుపూర్వోత్తరాలను తెలియజేసాడు. వారికి దైవబలం ఉందనీ, పాపం చేస్తేనే తప్ప వారి దేవుడు వారిని చేయి విడువడనీ చెప్పాడు. కనుక వారిని జయించడం కష్టమని హితవు చెప్పాడు. కాని సేనాపతి గర్వంతో అతని సలహాను పాటించలేదు.

శత్రుసైన్యం బెతూలియాను చుట్టుముట్టి నీటి సరఫరాను ఆపివేసింది. నగరపౌరులు 84 రోజుల వరకు తమవద్ద వున్న నీళ్ళ వాడుకున్నారు. ఆ మీదట త్రాగటానికి నీళ్ళలేక సొమ్మసిల్లిపోయారు. శత్రువుకి లొంగిపొమ్మని తమ నాయకుడైన ఉజ్జీయాను నిర్బంధం చేసారు. ఉజ్జీయా ఇంకా ఐదునాళ్ళ చూద్దాం. దేవుడు అద్భుతంగా వానకురిపించి