పుట:Bharatiyanagarik018597mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈప్రదేశము లాంధ్రదేశములోనివే యగుటచే, ఆంధ్రులు క్రీ. శ. 1, 2 శతాబ్దములలో ఇండోచైనాకు వలసపోయి యిచట నొకహిందూరాజ్యమును స్థాపించిరను ముఖ్యాంశము సర్కారుపండితుని వ్రాతలనుండి స్పష్టమగుచున్నది.

చంపారాజ్యచరిత్రమును రచించుటకు పెక్కు సంస్కృత శాసనములును, తాత్కాలికులవ్రాతలు నుపకరించుచున్నవి. క్రీ. శ. 1 వ శతాబ్దమున చైనాలో చేరియుండిన యీభాగమున అమరావతి యనుచోట శ్రీమారుడు తనస్వాతంత్ర్యమును బ్రకటించెను. అతని కాలమున నీరాజ్యమున పాండురంగ, విజయ, కౌథారయను మరిమూడువిభాగములుండినవి. అతని సంతతివారు మాతృదేశమునందలి హిందూమతము నిచట వ్యాపింపజేసిరి. దేవాలయములెల్లెడలను నిర్మింపబడినవి. స్థానికులగు చామ్‌ప్రజలు త్వరలో నీహిందూమతమును, హిందువుల యాచారవ్యవహారములను స్వీకరించిరి. ఈశ్రీమారవంశమునకు బిమ్మట క్రీ. శ. 336-420 నడుమ నొకక్రొత్తవంశము చంపాసింహాసనము నధిష్ఠించెను. ఈవంశీయులలో మూడవవాడగు భద్రవర్మ మిక్కిలి గొప్పవాడు. 'ధర్మమహారాజ' యను నితని బిరుదము దక్షిణహిందూదేశపు పల్లవ, వాకాటక, కదంబరాజుల బిరుదులను పోలియున్నది. ఈతడు మీనన్ అనుచోట తనపేరిట భద్రేశ్వరస్వామియాలయమును గట్టించెను. ఈతని తనయుడగు గంగరాజు విరాగియై, రాజ్యమును త్యజించి, గంగానదిని దర్శించుటకై హిందూదేశమున కేగెను.

క్రీ. శ. 420-530 నడుమ నీరాజ్యమునం దంత:కలహములో వినవి. చంపారాజ్యవిజృంభణమును గాంచి యోర్వలేక చైనాదేశీయు లీయదనున నీరాజ్యముపై దండెత్తి, రాజధానిని దోచి, దేవళములను కాల్చిరి. పిమ్మట క్రీ. శ. 530 లో శ్రీరుద్రవర్మయనునతడు చైనాదేశీయులచే చంపారాజ్యమున కభిషిక్తుడయ్యెను. ఈమూడవ రాజవంశము