పుట:Bharatiyanagarik018597mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉగ్రపరిపచ్చ, ద్వాదశనిదాన మున్నగు నుద్గ్రందము లీతని నిర్దేశమున బరివర్తింపబడినవి. ఇదేకాలమునం దొక చైనాదేశభిక్షువు మిక్కిలి ప్రఖ్యాతి నందెను. మహామేధావియగు నీతడు సంస్కృతమున బాండిత్యమును సంపాదించి, ప్రతిమోక్షము మున్నగు గ్రంథముల నెన్నిటినో గంఠస్థముల జేశికొని, మహాయానబౌద్దము ననేకవిధముల బ్రచారముజేసెను. ఈతడు ఆచార్యబుద్దదేవుడని పిలువబడుచుండెను. (3) సోగ్డియనులు :- మధ్యఆసియాలో ప్రాముఖ్యతనందిన యొక జాతికిజెందియుండిరి. కృషియువాణిజ్యమును వీరికి ముఖ్యవృత్తులు. పర్షియనుల మతగ్రంథమగు అవెస్టాలో నీసోగ్డియనులు మగధదేశీయులుగ పేర్కొనబడియున్నారు. హిందూదేశమునకు సమీపము నందుండుటచే వారు క్రీస్తుశకారంభమున కీబౌద్దమత బరిచయమును గల్గియుండిరి. ఇటీవల మధ్యఆసియాలో నెన్నియో బౌద్దగ్రంథములకు సోగ్డియనుభాషలో భాషాంతరీకరణములు లభించినవి. క్రీ. శ. 3 వ శతాబ్దిలో సెంగ్‌హుయీ యనునాతడు చైనాకువెడలెను. ఇతనిబూర్వులు హిందూదేశమున స్థిరపడిరి. నాన్‌కింగ్ నగరమునకేగి యీప్రచారకు డొక విహారమును నిర్మించుకొని యటనుండి మతబోధ చేయదొడగెను. (4) కుచియనులు :- వీరు పూర్వముటారింనదీతీరమున నివసించుచుండిరి. మధ్యఆసియానుండి చైనాకుబోవు వర్తకమార్గములన్నియు కుచియనురాజ్యము మీదుగనే బోవుచుండినవి. త్వరలో హిందూదేశమునుండి మతప్రచారకు లీవర్తకమార్గముల ననుసరించి, కుచరాజ్యమును చేరిరి. క్రీ. శ. మూడవశతాబ్దమునం దీనగరమున 1000 బౌద్దస్థూపము లుండెడివనియు, బౌడ మతము బ్రబలముగ నుండినదనియు, దెలియుచున్నది. కుమారయను డను నాతడు హిందూదేశమునందొక రాజ్యమున మంత్రిగనుండెను. కొంత కాలమునకు బిమ్మట విరాగియై యీతడు మతప్రచారముచేయు సంకల్పముతో కుచియనురాజ్యమునకేగెను. రాజీతని నధికముగ గౌరవించి తనకు గురువునుజేసికొనెను. కొలదికాలమునకే రాజుపుత్రిక యీప్రచారకుని పెండ్లి