పుట:Bharatiyanagarik018597mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును సంబంధ మేర్పడెను. క్రీ. పూ. 21 వ శతాబ్దములో నీసిథియను రాజు చైనా చక్రవర్తి కొక బౌద్దగ్రంథము నంపెను. ఇదియే యాదేశపు బౌద్దమతపరిచయమునకు ప్రారంభము. క్రీ. శ. 1 వ శతాబ్దిలో సిథియనులు హిందూదేశమును జయించి, పంజాబునుండి బశ్చిమోత్తరమున ఆక్సన్ నదీతీరమువరకునుగల భూభాగమునం దొక సామ్రాజ్యమును నిర్మించిరి. మధ్యఆసియాలో వీరికిని చైనాకును సరిహద్దుల విషయమున సంఘర్షణ మొదవినది. ఈ సన్నిహీతత్వమువలన భారతీయ నాగరికత సథియను సామ్రాజ్యముగుండ చైనాకువిస్తరించుట కవకాశమేర్పడెను. ఇండోసిథియను భిక్షువు లనేకులు చైనాలో బౌద్దమతమును ప్రచారము చేసిరి. క్రీ. శ. 68 లో కశ్యప మతంగ ధర్మ రక్షయను వార లీకార్యమును నిర్వర్తించిరి. క్రీ. శ. 147 లో లోకక్షేముడను నొక విద్వాంసుడు చైనా కేగి మహాయాన గ్రంథముల నెన్నిటినో యాదేశభాషలోనికి బరివర్తించెను. దీచ్చౌకియన్ అను నొక సిథియను భిక్షువు క్రీ. శ. 100 లో చైనాదేశమునకు బోయి యట నూరు బౌద్దగ్రంథములను భాషాంతరీకరించి, దక్షిణచైనాలో బౌద్దమతమును విశేషముగ విస్తరించెను. ఈ మతప్రచారకులలో నెల్ల క్రీ. శ. 3 వ శతాబ్దినాటి ధర్మరక్షుడను భిక్షువగ్రగణ్యుడు. ఈతడు పెక్కుభాషలను నేర్చెను. హిందూ విద్వాంసునివద్ద విద్యనభ్యసించెను. బహుభాషావిదుడగు నీభిక్షువు 284-313 ల నడుమ రెండువందల సంస్కృతగ్రంథములను చైనాభాషలోనికి బరివర్తించెను. (2) పార్థియనులు :- క్రీ. శ. 2 వ శతాబ్దమున పార్థియను రాజగు మొదటి మిత్రడేటిస్ తన రాజ్యమును హిందూదేశమునందలి జీలంనదివరకును వ్యాపింపజేసెను. అంతటినుండియు నీరెండు దేశములకును సంబంధము గలిగినది. అందుమూలమున పార్థియనులు బౌద్దతత్వమును గ్రహింపగలిగిరి. క్రీ. శ. 138 లో నొక పార్థియనురాజు రాజ్యమును ద్యజించి గొన్ని బౌద్దగ్రంథములతో చైనాదేశమున కేగి, యచ్చట విశేషముగ బరిశ్రమచేసి, బౌద్దగ్రంథ భాషాంతరీకరణమునకై యొక సంఘము నేర్పరచెను. ఈతడు లోకోత్తముడని పిలువబడుచుండెను.