పుట:Bhaarata arthashaastramu (1958).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

వ్యవహార నిర్మాతలు

ఆదిని శ్రమనుగూర్చి వ్రాయుచో దేశమన శ్శ్రమంబులని, యది రెండు తెఱంగులని, యంటిరిగాని యా మనశ్శ్రమ యేమూలడాగెనో యెక్కడకేగెనో మాకంట బడలేదని చదువరులు హాస్యమునకుం బూనుదు రేమో? ప్రస్తావవశంబున నక్కడక్కడ వెదజల్లినట్లు, ఈవిషయమునకు సంబంధించిన చర్చల బొందించి తిమిగాని కలిసినట్లు వ్రాయ వీలుదొరక దయ్యె. ఈ కొఱంత నిటగొంత నివారింతము:-

వ్యవహారముల విస్తరించుట

వ్యాపారము లల్పములై యిరుగుపొరుగు సీమలమాత్ర మాశ్రయించి యల్లుకొని యుండిన కాలములో దీర్ఘాలోచనకు నెడమెక్కడిది? ఇంత గిరాకియ వచ్చునని శిల్పులకెల్ల మున్ముందుగనే తెలియును. ఏ యే వస్తువులలో నెవరికెంత మాత్ర మాదరమున్నదో యది తూచినట్లందఱకును విశదము. ప్రాచీనాచార పద్ధతులే పరమపదవులని యుండు వారుగాన నడుగువారు కోరునవియు, నిచ్చువారు చేయునవియు నన్నియు బ్రాతలే. తాతగోరినదే మనుమడును గోరును. తాతచేసినదే మనుమడును జేయును! గిరాకిదారులకును సరఫరాదారులకును బొత్తు సంపూర్ణముగా గుదిరి యుంటబట్టి వ్యవహారముల నభావితము లెవ్వియు బుట్టవయ్యె. మఱియు నాచారబద్ధులౌటంజేసి ప్రాతవి మఱుపునకురావు. క్రొత్తవి మనసునకురావు. లాభనష్టములు రెండును లఘువులై జీవనోపాయము లొకటేరీతి వర్తించుచుండెను. ఉండునవిగిట్టవు. లేనివిపుట్టవు. ఇట్టివ్యవస్థలో యోచనాశక్తికేమిపని? కావున జడులరీతిని జనులు ప్రవర్తించుచుండిరి. శిరస్సులు చూపునకే గాని విచారణలకు గానివయ్యె. తఱువాత ముఖ్యముగా బశ్చిమ