పుట:Bhaarata arthashaastramu (1958).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెట్లో, వారికి యంత్రప్రవర్తిత పరివర్తనక్రియలట్లు. శత్రువుల యుద్ధపు నావలు అభేధ్యమైన ముట్టడింబన్నిన పదిదినములలో క్షామపీడనముచే వినయ వినమితులు గావలసివచ్చు ననియు, ఒకటి రెండు వారముల మాత్రమునకన్న నెక్కువ యాహారమయ్యెడ నేక కాలంబుననుండుట లేదనియు, తామే పంటలంబెట్టినను నందఱకుం జాలినంత తేలించుటకుం దరముగాదనియు, కోవిదులు మొగమోటములేక పల్కుచున్నారు "ఇంగ్లాండీరీతిని ఒంటికాలున నిలిచినదే! దాని యైశ్వర్యం శంపాలతం బోలినదిగదా" యని సంశయించిన, అది స్థిరమో యస్థిరమో నిర్ధారణజేయుటకు నేను ఆనిబిసెంటమ్మ గారి శిష్యుడను గాను. ఇంగ్లీషువారు నిర్భయతనుండుటకై యాయత్త పఱచిన సన్నాహము లేవనగా:- 1. అద్వితీయమైన యుద్ధనౌకాశ్రేణి. వీరు ఐరోపాలోని రెండు మూడు రాజ్యములు గలిసివచ్చినను సముద్ర యుద్ధములో ననాయాసముగ నోడించునంత శక్తిగలవారు. వరుణలోక చక్రవర్తు లనందగినంత బలాఢ్యులు ఇంగ్లాండు ద్వీపముగాన నావలచేనేగాని భూచారసైన్యములచే నోడించుటకుగాదు. ప్రకృతం దానిని నావలచే నావరింపజూచుట సింగంబునకు సిళ్ళుజూపినట్లు. 2. ఇండియా మొదలైన తూర్పుదేశములను, తమజాతివారే వలసపోయి వ్యాపించి ప్రసిద్ధికిదెచ్చిన కానడా మొదలగు పుత్రికారాష్ట్రములను, తమ్ము వదలకుండునట్లు భయము నయముం బచరించి బద్ధ సఖ్యములంజేసి వానితోడి వర్తకము ననంతముగజేయుట. ఇందుచే ధాన్యాదులగు పచ్చివస్తువులకుం గొదువలేక యాచంద్రతారార్కముగా నుండవచ్చునని వారి తలపోత. తలవ్రాత యెట్లున్నదో యెవరెఱుంగుదురు?

శ్రమవిశ్లేషమున కనుకూలించు సమయములు

వీనిని బూర్వమే చర్చింతిమి గాన సూచనగా నిట జూపినం జాలుగదా! ఉత్పత్తి వాణిజ్యము ఇవి యితరేతరాధారములు. ఇవి