పుట:Bhaarata arthashaastramu (1958).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాది క్రియలలో తారతమ్యములు గలవియైనను, ఆవశ్యక వస్తుసంతాన విషయమై. ఇతరులతోడి వాణిజ్యమే తావలముగ నుండునవి లేవు. ఒకవేళనుండెబో! వానికి గాచికోలు కష్టము. ఈవిషయము వినిమయకాండమునకుం జేరినదౌట నిక్కడ నింతచాలు.

దేశములు సమగ్రములుగానుండుట యావశ్యకమా కాదా యను విచార మటుండనిండు. వాణిజ్యవ్యాప్తిచే దేశములు సమగ్రములు గాకపోవు జాడగలవిగా నున్నవి. "ఐరోపావారు పరివర్తన కళాపారీణులుగదా. మనము పంటకాపులము. వారికి పంటలు ప్రియములుగాన నధికముగ వెలనిత్తురు. ఇక పరివర్తన కళలు మనకేల? ధాన్యముల ధరలు నానాటికి మించుచున్నవికదా? ఇందుచే వచ్చిన లాభముచే విరచిత వస్తువులన్నియు గొనవచ్చును. మనమే విరచించుటయేల?" అనియున్న మనకు కృషి వృత్తియే ప్రధానమగును. ఏకవృత్తినుండు రాజ్యమును ఏకపుత్రుడు గలిగిన కుటుంబమును సమానములు. అనగా నమ్మి తృప్తిమై నుండదగినస్థితి నావహించిన యవిగావు.

భూమండలమున నిపుడున్న రాజ్యములలో నింగ్లాం డొక్కటిమాత్రము చూచుటకు నపాయకరమైన ఆర్థికగతిం దాల్చియున్నది. వాణిజ్యము పరివర్తన క్రియలును భావింపరానియంత యుత్కృష్ట స్థితిం జెందినవికాని, ఇండియా, ఈజిప్తు, ఇత్యాదులగు ప్రాతరకపు ప్రదేశములు విధేయములై వానివర్తకమెల్ల తన్నుంజెందుటచేతను, అమెరికా, దక్షిణామెరికా మొదలగు ఖండముల బేహారములలో బహుభాగము దనవశంబగుటచేతను, తమతో రక్తసంబంధమును రాష్ట్రసంబంధమునుగల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కానడా మొదలైన సీమలుండుటచేతను, కచ్చావస్తువులన్నియు దిగుమతి చేయించుకొనిన వ్రయము తక్కువయని ఇంగ్లాండు మహారాజ్యము కృష్యాది పరికర్షణ క్రియల నశ్తద్ధచేసి కడులాఘవం బందజేసినది. మనకు భూవ్యవసాయ