పుట:Bhaarata arthashaastramu (1958).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూపులుగల శాస్త్రవేత్తలకుగాని యితరులకు గోచరంబగుట యపూర్వమ, చివరకు శుద్ధామృత విషంబులు రెండునురావు. మఱి సుఖదు:ఖములట్లు సమ్మిళితములై సంభవిల్లును. వీనిలో సుఖము ఘనతరముగ నుండుననుట సంభావ్యము. ఎంత సుఖసమృద్ధులున్నను మలినము పూర్ణముగ బరిహారంబుగాదు. కాకుండుటయు మంచిదే? ఏలన, ఈ మలినమును సదమలము జేయజూచుటయే వృద్ధికి నుద్దీపకము. పరిశుద్ధము, అనశ్వరము, అఖండమునగు సౌఖ్యము అవతరించెనేని పౌరుష మస్తమించి యంతమొందును. అట్టిస్థితి సోమరిపోతులకుం గాని యితరులకు నింపుకాదు.

పశ్చిమ ఖండములలో స్పర్ధ పరిణమించిన క్రమము

1. తొలుత సామాన్యబలులైవా రొండొరులతో వైరమెత్తుట.

2. తరువాత, నావైరంబుచే హీనబలులు స్వతంత్రతం గోలుపోగా మహాబలులైనవారు కొందఱు దినదిన ప్రవర్థమానతేజస్కులై నిర్వైరంబుగ వ్యవహారంబుల జరుపుట.

3. తదనంతరము, మహాబలులు సయితము సంఘీభవన మనర్గళ బలప్రదాయకంబని యొండొరులతో గలిసి, వ్యవస్థలేర్పఱచి యేకచ్ఛత్రంబుగ బరిపాలింపజూచుట. ఈ సంఘములకు 'ట్రస్టులు' అని హూణభాషలోబేరు.

4. యజమానులతోను, యజమాన సంఘములతోను బ్రతిఘటించుకొఱకు శిల్పులు శ్రేణులు వన్నుట.

5. ఈ యార్థికవైరములలో జనులకు ననర్థములగునని సర్కారు వారు, ఇరుపరమ్ముల వారిని తమపై విచారణ నిబంధనములకుం బాత్రులంజేయ శాసించుట.

6. "సర్కారువారేల? మనమె మైత్రినెఱపి క్రమముల దీర్చికొన్న నింకను గౌరవముగదా" యని వియోగమువీడి,