పుట:Bhaarata arthashaastramu (1958).pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్ర్యము స్పర్ధాక్రియకుంజాలదు. మఱి నామమాత్రంబ. నామమాత్రంబుం బొనరింప శాస్త్రశక్తికిందోడు అర్థశక్తియు రావలయు, మనపుణ్యభూమిలో బలమున్న స్వచ్ఛందవిహారము లందఱును జేసి కొనవచ్చునని యాంగ్లేయశాసనము లాదేశించియున్నను, అర్థాశక్తి, అనాచారములు, ప్రతిఘాతుకములై యుంటచే స్వతంత్రత పుట్టిపుట్టని స్థితిలోనున్నది. విదేశములస్పర్ధకు నెక్కువ ప్రతికారియై యుండునది బీదతనము. స్వదేశమున బీదతనమునకుదోడు మతాచారములును పిరిగొనియుండుట నీపాశము లేశమున దెగునదికాదు.

మనదేశములో సహజవిరోధములు చాలవని కృత్రిమము లసంఖ్యములు గల్పించియున్నారు. అందు ముఖ్యములు 1. జాతిభేదములు. 2. వివాహములు, పితృతర్పణములు మొదలైన ఋణములం దీర్చుటకై తమ బలగములోనికి వచ్చిచేరవలయుననుట. 3. భూలోక సంచారము నారద మహామునికి దప్ప నితరులకు నిషేధ్యమనుట. 4. ఒడలును దోమని యనేకస్నానములు, ఆవుపేడతో నలుకుట మొదలగు శుభ్రతలేని శుద్ధులు. 5. దేశమున వివిధ వేషభాషాదులుండుట ఇవి మొదలగునవి.

ఏదేశమైన నిదర్శించి చూడుడు. ఆ దేశస్థులు తమలో దాము పోట్లాడు భంగి పరదేశస్థులతో జీవనోపాయములకై పెనంగ శక్యులుగారు. ఎట్లన చలముజూపుట యనగా స్థానభ్రష్టత్వ మొనరింప గడంగుట కర్మకరులు పరదేశములకు బోయి యచ్చటి వైతనికులతో మత్సరించుటకు జాతి వర్ణ వేషభాషా వైషమ్యములు అడ్డములు. ఒకరిస్థానము నింకొక రాక్రమింప వలయునన్న కళానిపుణతయే కాదు. తక్కిన సహకర్ములతో గలసి మెలసి యుండుట కనువైన యంత సాదృశ్య మావశ్యకము. చంద్ర మండలమున నున్నవారితో వైరమెత్తుటకు యానాలాభమును, పారసీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, వీరిపై గూలివిడియుటకు, వారిదేశములలో వారితో