పుట:Bhaarata arthashaastramu (1958).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేయునవియే! ఇది చిత్రమైనను సత్యమే. స్పర్ధయనురాగమునకును, అనురాగము స్పర్ధకును మేరలేర్పఱచి శుభసంపాదకములంజేయుట మన భాగ్యమేగాని యన్యముగాదు. సంపూర్ణ స్పర్ధవుండి యనురాగము లల్పములైన ధనము నార్జించి యేమిసుఖము? ఎవరికిచ్చి సంతోషపఱచి మనమును సుఖపడగలము? ఆహా! మనుష్యులకు పరోపకారమువలె నానంద సందాయకము లెవ్వియైనంగలవా? ఇక ననురాగము పిచ్చిముదిఱి రేయనక పగలనక భార్యను బ్రక్కనగూర్చుండ బెట్టుకొని ఱెప్పవేయక కనులవిందు జేయుచుండిన కూడెట్లు గుడ్డలెట్లు? ఈ విందునం దాసక్తి గలిగించు తక్కిన విందులకుం గతియేమి? ఇదియుం జెల్లదు. అనర్గళప్రవాహము లనకట్టుచే నడ్డగింపబడి యుపయోగకరములౌమాడ్కి స్పర్ధానురాగము లితరేతర సహజ నిరోధకములై యుండుట యనుభావ్యములై యున్నవి.

శ్రమకరుల స్పర్ధ

ఆనాటి కంబలియైన నరుదుగనుండెడివారు దొరకినమాత్రము లాభమెనియెంచి పోటీజేయజాలరు. యజమానులకుం గింకరులకు నుండు నమోఘవ్యత్యాసం బియ్యదియ. బేరముంజేయుటలో నధిపతు లిచ్చవచ్చినంతకాలము వేచియుండ శక్తిగలవారు. కావున వారాతుర పడక ముందువెనుకలు విచారించి యెంత తక్కువకూలి యిచ్చినం జాలునో ఆ మాత్రమే యిత్తుమందురు. భృత్యులైనవారు చాలునంత వస్తువుల మిగిలించినవారుగాన కావున నిలిచి నిదానముగ దర్కింపజాలరు. మనదేశములో మాలమాదిగలకు గవర్న్మెంటువారు స్వతంత్రతను ధారాళముగ దక్షిణయిచ్చినను తిండిలేనిది స్వతంత్రత నెట్లు ప్రయోగింపనౌను? స్వతంత్రత యనునది తినువస్తువా? లేక యంగడికి బోయి యమ్మి యుప్పు, బియ్యముకొన ననువైన నాణెమా? స్వతంత్రత యెంతతీపైనను దానిధ్యానించుచు నిరాహారులై ప్రాయోపవేశము జేయువారెవ్వరునులేరు. కావున శాసనప్రాప్తమైన స్వాతం