పుట:Bhaarata arthashaastramu (1958).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పూర్వము స్వదేశమునందో స్వజాతీయు లయినవారితోనో మాత్రము వ్యవహారములు జరుగుచుండెను. ఇపుడు నాగరికాగ్రేసరుల వర్తకములు దిగంత విశ్రాంతములుగాని యలతుల నిచ్చునవిగావు.

4. చిన్నచిన్న రాజ్యముల నాహుతిగొని గొప్పదేశము లిపుడు అఖండతేజంబున బ్రజ్వరిల్లుచున్నయవి. పూర్వము భరతఖండము మహోన్నతస్థితినుండు సమయమునను "ఛప్పన్నని" అనబడు 56 దేశము లుండినవట! ఇపుడొక రాజపుటానాలోమాత్రము 96 సంస్థానములు పుట్టలోని చెదలుంబలె మలమలలాడుచున్నవి. జాతిచ్ఛేదము తోడ దేశచ్ఛేదము నొనర్చుట ఆర్యావర్తంబు తెఱగు. సంభూతిగ నుంచుట పాశ్చాత్యుల యాచారంబు. వారు దేశమును జాతులును నానాటికి వైశాల్యమును సంశ్లేషమునుం గనునట్లు, కెలంకుల సీమల నాక్రమించియు పెఱవారిని కష్టములకు గప్పములకు బాల్పఱిచియు, బాఱదోలియు, తమజనంబులకు దొరతనము భూధనంబులును సేకరించి, యేదిక్కున గాంచిన దామేయై చెలంగెదరు. ఇంగ్లాండు, రష్యా, జర్మనీ, అమెరికా ఈ దేశములవారి యుద్ధామత నెఱిగినవారు ఈ రీతినే వీరు ఇకముందును దిశాంతములనెల్ల దీటుకొనం బ్రసరించిరేని ఒకానొకప్పుడు ఈ భూమండలంబెల్ల నేకచ్ఛత్రాధి పత్యముక్రిందికిదెచ్చి యొకేరాజ్యము జేయగలరని యూహించెదరు. ఇట్లు సార్వభౌమత్వసిద్ధి కెదురుచూడదగినవారితో నింకను వడగల, తెంగల, అయ్యరు, అయ్యంగారు, ఆచారి, శాస్త్రి మున్నగు సనాచారపుబోకల బోవువారును జాతి మత దేశ భాషా విపర్యయంబులచే కండతుండములుగ ఖండింపబడిన మనమెట్లు స్పర్థించి మానప్రాణముల దక్కించుకొందుమో యెఱుగ రాకున్నది.

ఆధునిక నీతులు

1. ఆధ్యాత్మిక తత్త్వంబుల ఘనత నించుమించుగ నప్తమింపజేసి ప్రకృతి జీవమానవ సంఘతత్త్వములు ఉదయించి ప్రపంచ