పుట:Bhaarata arthashaastramu (1958).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలుత 1 పుట్టికగు వ్రయము 8 అణాలు.

పిదప ఎక్కువ పుట్లు పండించిన పుట్టికి 20/35 = 9 చిల్లరఅణాలు.

అటుతర్వాత నింకను వృద్ధి జేయగోరిన పుట్టికి 40/60 = 10 చిల్లర అణాలు సెలవగును.

రాశి యెక్కువ కానుగాను ప్రతిభాగముయొక్కయు వ్రయ మధికమగును. వ్రయ మెక్కువయైన క్రయమును ఎక్కువయౌట సహజము. మనతాతలనాఁటికన్న నేఁడు ధాన్యములు గిరాకిగా నుండుటకు ఇదియొక ముఖ్యకారణము. ప్రజాసమృద్ధి కతన నెక్కువ యుత్పత్తి చేయవలసివచ్చె. ప్రాతభూములు హీనవృద్ధికి జేరినవగుటయు క్రొత్తగా సాగుబడికిఁ దేఁదగు నూతన భూములు అలభ్యము లౌటయు నిమిత్తములుగ ధాన్యములవెల నానాఁటికి బెరుగుచున్నది. ఈ 1911 వ సంవత్సరములో ఐరోపాఖండమున జనులును ఇందుచే మిక్కిలియు నలజడి గొన్నవారై కొన్ని పట్టణములలో వెలలు హెచ్చుటచే నయిన క్షామబాధ నోర్వఁజాలక దుండగములకుంజొచ్చి కొల్లలువెట్ట నారంభించిరి.

ఈ న్యాయముల కొంకొక నిర్వచనము

సారము సహజముగ నభివృద్ధిఁజెందుడు ఒక్కరాశి నార్జింప వలయునన్న ఒకతూరికంటె రెండవతూరియు ఇట్లే క్రమంబుగను వ్రయము తగ్గుచువచ్చును.

సారము సమరీతి నుండెనేని వ్రయమును స్థిరతఁ గాంచును.

సారము తగ్గుట కారంభించిన ఏకరాశికే ప్రతితూరియు నెక్కువగా వ్రయము చేయుట యవశ్యమగును.

హీనవృద్ధి యనేక క్రియలయం దుపగతమైయున్నది. కుండలు కడుగునపుడు సగముమైల వదలినను తుదిభాగమును బోఁగొట్టవలయునన్న ఎన్నియోమార్లు తోమినఁగాని సాధ్యముగాదనుట యిల్లాండ్ర కెల్లరకును గోచరమైన సంగతియే. ఒక పర్యాయము పుస్తకముఁ జదివిన మూఁడింటనొకపాలు మార్కులు తీయుట సులభము. ఇంతకుఁ